SRHvsKXIP: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... పంజాబ్ ఆశలు సంక్లిష్టం...

Published : Oct 08, 2020, 11:23 PM ISTUpdated : Oct 08, 2020, 11:29 PM IST
SRHvsKXIP: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... పంజాబ్ ఆశలు సంక్లిష్టం...

సారాంశం

17 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్... మూడు వికెట్లు తీసిన రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌కు 2 వికెట్లు... 69 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆరు మ్యాచుల్లో ఐదు పరాజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

నికోలస్ పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే రనౌట్ కాగా, సిమ్రాన్ సింగ్ 11, కెఎల్ రాహుల్ 11, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, మన్‌దీప్ సింగ్ 6, ముజీబ్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా... నికోలస్ పూరన్ ఒక్కడూ ఒంటరి పోరాటం చేశాడు.

37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసిన పూరన్... అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 28 పరుగులు రాబట్టాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ అవుట్ కావడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి ఖరారైంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఖలీల్ అహ్మద్,నటరాజన్ రెండు, అభిషేక్ శర్మ ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

ఇది కదా కిర్రాకెక్కించే వార్త.. బెంగళూరులోనే RCB మ్యాచ్‌లు.. ఇక గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే
T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్