ఇంటర్నేషనల్ యోగా డే: సెహ్వాగ్ ఆసనం.. జుట్టుపీక్కుంటున్న నెటిజన్లు

Siva Kodati |  
Published : Jun 21, 2020, 03:09 PM ISTUpdated : Jun 21, 2020, 03:10 PM IST
ఇంటర్నేషనల్ యోగా డే: సెహ్వాగ్ ఆసనం.. జుట్టుపీక్కుంటున్న నెటిజన్లు

సారాంశం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సామాన్యులతో పాటు ప్రముఖులు  యోగాసనాలు వేశారు. ఈ క్రమంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వేసిన ఓ ఆసనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సామాన్యులతో పాటు ప్రముఖులు  యోగాసనాలు వేశారు. ఈ క్రమంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వేసిన ఓ ఆసనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మోకాళ్ల కిందకు తన చేతులు పెట్టి కేవలం పాదాల సాయంతోనే హాల్ ఆవరణలో నడవటం ప్రారంభించాడు. పాపం వీరూ దానిని చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో కాని వెంటనే ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

‘‘ఖచ్చితంగా ఇది యోగాసనం అని చెప్పలేను కానీ దానికి కొంత సమయం పడుతుందని’’ క్యాప్షన్ పెట్టాడు. ఈ వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘ నువ్వు చేసిన ఆసనం పేరేంటో తెలియదు కానీ నువ్వు  చాలా కష్టపడ్డావు’’ , నీ కష్టానికి ఇవే మా జోహార్లు అంటూ నెటిజన్లు  కామెంట్లు పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vaibhav Suryavanshi Net Worth : 14 ఏళ్లకే కోట్ల సామ్రాజ్యం.. వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత?
Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు