క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు... ఆరంటే ఆరు పరుగులకే ఆలౌట్ అయిన సిక్కిం..

By Chinthakindhi RamuFirst Published Dec 23, 2022, 3:17 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులకి ఆలౌట్ అయిన సిక్కిం... రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఆలౌట్... 

ఓ సిక్సర్ బాదితే 6 పరుగులు వచ్చేస్తాయి. అలాంటి టీమ్ మొత్తం కలిసి ఆరంటే ఆరు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యిందంటే నమ్ముతారా? అవును... సిక్కిం ఈ చెత్త రికార్డును మూటకట్టుకుంది...  విజయ్ మర్చంట్ ట్రోఫీ 2022 టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ దారుణమైన పరాభవాన్ని చవిచూసింది సిక్కిం. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. 

ఆర్యన్ కుశ్వత్ 43, హర్షిత్ 43, మనల్ చౌహన్ 170, ప్రతీక్ శుక్లా 86 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ సిక్కిం జట్టు 43 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరణ్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు సిక్కిం బ్యాటర్లు డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగుల ఆధిక్యం దక్కడంతో సిక్కింని ఫాలోఆన్ ఆడించింది మధ్యప్రదేశ్ జట్టు. రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం బ్యాటర్లు దారుణ ప్రదర్శన ఇచ్చారు.

వికెట్ కీపర్ అవ్‌నీశ్ ఓ ఫోర్ బాది 4 పరుగులు చేయగా 9వ స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు చేశాడు. మిగిలిన 9 మంది బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. 8 మంది బ్యాటర్లు డకౌట్ కాగా అందులో ఇద్దరు గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆఖరి స్థానంలో బ్యాటింగ్‌కి రావాల్సిన పర్వీణ్.. క్రీజులోకి రాకపోవడంతో అబ్సెంట్ హార్ట్‌గా అవుట్ అయ్యాడు..  ఇన్నింగ్స్‌ 365 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది మధ్యప్రదేశ్. 

సిక్సిం తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు కలిపి 49 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 49 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం బిగ్‌బాష్ లీగ్ 2022 టోర్నీలో సిడ్నీ థండర్ టీమ్ 15 పరుగులకి ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

click me!