
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ప్లేయర్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శుబ్‌మన్ గిల్ ఎడమ చేతికి గాయం కావడంతో, నాలుగో రోజు అతను ఫీల్డింగ్‌కి రాలేదు.
గాయం తీవ్రత తెలుసుకునేందుకు శుబ్‌మన్ గిల్‌ను స్కానింగ్‌కి పంపించినట్టు తెలిపింది బీసీసీఐ. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో పెద్దగా రాణించలేకపోయిన శుబ్‌మన్ గిల్, గాయం తీవ్రత పెరిగితే మూడో టెస్టులో బరిలో దిగే అవకాశం ఉండదు.
గిల్ ఆడకపోతే అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆడే అవకాశం ఉంటుంది. మొదటి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించిన బీసీసీఐ, త్వరలో మిగిలిన టెస్టులకు జట్టును ప్రకటించబోతోంది.