శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్! అయ్యర్, గిల్ హాఫ్ సెంచరీలు... తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు...

Published : Jul 22, 2022, 10:51 PM IST
శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్! అయ్యర్, గిల్ హాఫ్ సెంచరీలు... తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు...

సారాంశం

INDvsWI 1st ODI: 97 పరుగులు చేసి అవుటైన కెప్టెన్ శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీలతో రాణించిన శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్... 

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు..


శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కి 18.4 ఓవర్లలో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు... వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్... 

99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన శిఖర్ ధావన్, గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో షామర్‌ బ్రూక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 90+  స్కోర్ల వద్ద అవుట్ కావడం శిఖర్ ధావన్‌కి ఇది 10వ సారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 27 సార్లు, రాహుల్ ద్రావిడ్ 12 సార్లు 90ల్లో అవుటయ్యి, శిఖర్ ధావన్ కంటే ముందున్నారు...

వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు.. 

అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు...

వెస్టిండీస్ పర్యటనలో 90ల్లో అవుటైన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 2009లో ఎమ్మెస్‌ ధోనీ 95 పరుగుల వద్ద అవుట్ కాగా శిఖర్ ధావన్ 13 ఏళ్ల తర్వాత 97 పరుగులకి పెవిలియన్ చేరాడు... 

ధావన్ అవుటైన కొద్దిసేపటికే శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా గుడకేశ్ మోటీ బౌలింగ్‌లోనే పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 

నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న సంజూ శాంసన్ 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి రొమారియో షిఫర్డ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

దీపక్ హుడాతో కలిసి ఆరో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 21 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

32 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన దీపక్ హుడా కూడా అదే ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ రూపంలోనే పెవిలియన్ చేరాడు... ఒకానొక దశలో ఈజీగా 330+  స్కోరు చేస్తుందనుకున్న భారత జట్టు, మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల డెత్ ఓవర్లలో అనుకున్నన్ని పరుగులు రాబట్టలేకపోయింది. శార్దూల్ ఠాకూర్ 7, సిరాజ్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?