పాక్ యంగ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ చరిత్ర... కెప్టెన్‌గా లాహోర్ ఖలందర్స్‌కి పీఎస్‌ఎల్ టైటిల్...

Published : Feb 28, 2022, 10:17 AM IST
పాక్ యంగ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ చరిత్ర... కెప్టెన్‌గా లాహోర్ ఖలందర్స్‌కి పీఎస్‌ఎల్ టైటిల్...

సారాంశం

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2022 టైటిల్ గెలిచిన లాహోర్ ఖలందర్స్... అతి పిన్న వయసులో పీఎస్‌ఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా షాహీన్ ఆఫ్రిదీ రికార్డు...

పాకిస్తాన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2022 సీజన్‌లో లాహోర్ ఖలండర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన షాహీర్ ఆఫ్రిదీ, సారథిగా తొలి సీజన్‌లోనే టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు...


ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 టైటిల్ గెలిచిన షాహీన్ ఆఫ్రిదీ, టీ20 టైటిల్ గెలిచిన యంగెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. షాహీన్ ఆఫ్రిదీ వయసు (రికార్డుల ప్రకారం) 23 ఏళ్లు. పీఎస్‌ఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముల్తాన్ సుల్తాన్ జట్టుపై 42 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని, టోర్నీ చరిత్రలో మొట్టమొదటి టైటిల్ అందుకుంది లాహోర్ ఖలందర్స్ జట్టు...

తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకార్ జమాన్ 6 బంతుల్లో 3 పరుగులు చేయగా షఫీక్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు...

వికెట్ కీపర్ జీషన్ అష్రఫ్ 7 పరుగులు చేసి అవుట్ కాగా కమ్రాన్ గులాం 20 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది లాహోర్ ఖలండర్స్. ఈ దశలో మహ్మద్ హఫీజ్ 46 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేయగా హారీ బ్రూక్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు, డేవిడ్ వీస్ 8 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...

181 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముల్తాన్ సుల్తాన్స్, 19.3 ఓవర్లలో 138 పరుగులకి ఆలౌట్ అయ్యింది. షాన్ మసూద్ 15 పరుగులు చేసి రనౌట్ కాగా కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఆమీర్ అజ్మత్ 6, రిలే రస్పోవ్ 15, అసిఫ్ ఆఫ్రిదీ 1, టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు, కుష్‌దిల్ షా 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

డేవిడ్ విల్లే డకౌట్ కాగా, రోమన్ రాయిస్ 6, ఇమ్రాన్ తాహీర్ 10 పరుగులు చేసి అవుట్ కావడంతో ముల్తాన్ సుల్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ ఆఫ్రిదీ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహ్మద్ హఫీజ్ , జమాన్ ఖాన్ రెండేసి వికెట్లు, హరీస్ రౌఫ్, డేవిడ్ వీస్  తలా ఓ వికెట్ తీశారు. 

భారత్‌పై టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి పాక్ క్రికెటర్‌గా నిలిచిన షాహీన్ షా ఆఫ్రిదీ, పీఎస్ఎల్‌ సీజన్ 7లో 13 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !