ICC: ఇవేం సెలబ్రేషన్స్‌రా నాయనా..? వికెట్ తీయగానే గెంతులు వేస్తూ గోల గోల

Published : Jul 22, 2022, 05:13 PM IST
ICC: ఇవేం సెలబ్రేషన్స్‌రా నాయనా..? వికెట్ తీయగానే గెంతులు వేస్తూ గోల గోల

సారాంశం

T20 World Cup 2022:ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ గ్రూప్-ఏ లో భాగంగా సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సెర్బియా బౌలర్ అయో మేనే-ఎజెగి  విచిత్రమైన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.   

క్రికెట్ లో ఒక్కో ఆటగాడిది ఒక్కో రకమైన సెలబ్రేషన్. బ్యాటర్లకు హాఫ్ సెంచరీ చేసినప్పుడో లేదా సెంచరీ చేసినప్పుడో మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. కానీ బౌలర్లకు అలా కాదు. వికెట్ తీసిన ప్రతీసారి వేడుకే. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ఒక్కొక్కరిది ఒక్కోశైలి.  ఔటై వెళ్తున్న బ్యాటర్ల మీద అరవడం.. డాన్సులు చేయడం.. అప్పటికి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కు కాలు కదపడం.. ఇలా బోలెడు చేస్తారు. కానీ ఇక్కడ ఓ బౌలర్ వీటన్నింటికీ బాప్ అనిపించే విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. 

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ గ్రూప్-ఏ లో భాగంగా సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భాగంగా  సెర్బియా బౌలర్ అయో మేనే-ఎజెగి  విచిత్రమైన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 

వికెట్ తీసిన ఆనందంలో ఎజెగి గ్రౌండ్  పై ఫ్లిప్స్ (గెంతులు) వేశాడు. వికెట్ తీయగానే పచ్చిక మీదకు వెళ్లి రెండు సార్లు గెంతులు వేసి తర్వాత నేలపై రెండు చేతులను బార్లా చాచి పడుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు నాలుగు వికెట్లు తీశాడు. వికెట్ తీసిన ప్రతీసారి ఇదే సెలబ్రేషన్స్ తో అక్కడున్న వారిలో నవ్వులు పూయించాడు.  

 

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తాజాగా తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ‘వందో వికెట్ తీసిన ఆనందంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సెర్బియా క్రికెటర్ అయో ఎజెగి’ అని షేర్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

ఇదిలాఉండగా  ఈ మ్యాచ్ లో ఐల్ ఆఫ్ మ్యాన్ 68 పరుగుల తేడాతో సెర్బియా పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సెర్బియా  20 ఓవర్లలో ఏడు వికెట్లకు 97 పరుగులే చేయగలిగింది.  
 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు