రంజీ రారాజు సౌరాష్ట్రనే.. ఫైనల్లో చిత్తుచిత్తుగా ఓడిన బెంగాల్

Published : Feb 19, 2023, 11:17 AM ISTUpdated : Feb 19, 2023, 11:32 AM IST
రంజీ  రారాజు సౌరాష్ట్రనే.. ఫైనల్లో  చిత్తుచిత్తుగా ఓడిన బెంగాల్

సారాంశం

Ranji Trophy:  కోల్కతా వేదికగా  ముగిసిన రంజీ ట్రోఫీ-2023 ఫైనల్  లో  సౌరాష్ట్ర జయకేతనం ఎగురవేసింది.   బెంగాల్ జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 

దేశవాళీలో  ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ - 2023  టైటిల్ ను  సౌరాష్ట్ర సొంతం చేసుకుంది.    కోల్కతా వేదికగా  ముగిసిన  మ్యాచ్ లో  సౌరాష్ట్ర.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టి  తన ఖాతాలో రెండో  టైటిల్ ను  దక్కించుకుంది.  మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు  169-4 తో నాలుగో రోజు  ఆరంభించిన బెంగాల్.. 241 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టును ఆదుకోవాలని  చూసిన బెంగాల్ క్రీడా మంత్రి, కెప్టెన్ మనోజ్ తివారి   (68)  తో పాటు  షాబాజ్ అహ్మద్ (27) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 

ఆ తర్వాత బెంగాల్ ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు.   రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్.. 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా   14  పరుగుల  లక్ష్యాన్ని  సౌరాష్ట్ర.. 2.4 ఓవర్లలోనే ఛేదించింది.   

ఈ మ్యాచ్ లో  తొలుత  బ్యాటింగ్ చేసిన బెంగాల్  174 పరుగులకే ఆలౌట్ అయింది.  సౌరాష్ట్ర బౌలర్లు ఉనద్కత్, చేతన్ సకారియా లు తలా మూడు వికెట్లు తీయగా  చిరాగ్ జాని, డిఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం  సౌరాష్ట్ర.. తొలి ఇన్నింగ్స్ లో  404 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఆ జట్టు లో హర్విక్ దేశాయ్, జాక్సన్, వసవడ, చిరాగ్ జాని, ప్రేరక్ మన్కడ్ లు రాణించారు. 

 

రెండో ఇన్నింగడ్స్ లో  బెంగాల్.. 241 పరుగులకే ఆలౌట్ అయింది.  సౌరాష్ట్ర బౌలర్లలో  కెప్టెన్ ఉనద్కత్ ఆరు వికెట్లతో చెలరేగగా   సకారియా  మూడు వికెట్లు పడగొట్టాడు.  14 పరుగుల లక్ష్యాన్ని  సౌరాష్ట్ర..  2.4 ఓవర్లలోనే ఛేదించింది.  

రంజీలలో   సౌరాష్ట్రకు ఇది రెండో ట్రోఫీ.  గతంలో 2019-20 సీజన్ లో కూడా    సౌరాష్ట్ర  టైటిల్ విజేతగా నిలిచింది. అప్పుడు కూడా  ప్రత్యర్థి బెంగాలే కావడం గమనార్హం.  కాగా రంజీలలో  ఇది  బెంగాల్ కు 15వ ఫైనల్ కాగా  13 సార్లు రన్నరప్ గానే నిలిచింది.   స్వంత స్టేడియంలో  ఆ జట్టు  రాణించలేకపోయింది.   గడిచిన నాలుగు సీజన్లలో సౌరాష్ట్రకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం.  

కెప్టెన్ గా ఉనద్కత్  తన జోరు కొనసాగిస్తున్నాడు. 2019-20 సీజన్ లో కూడా   సౌరాష్ట్ర అతడి సారథ్యంలోనే తొలి రంజీ ట్రోఫీ నెగ్గింది.   గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రనే విజేత.

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !