2019లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్... తన పార్టనర్ డియానా ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ ట్వీట్..
ఇంగ్లాండ్ మాజీ ఉమెన్ వికెట్ కీపర్ సారా టేలర్ త్వరలో తండ్రి కాబోతోంది. అదేంటి? మహిళా క్రికెటర్ అంటే తల్లి కావాలి కదా... అనుకుంటున్నారా! అక్కడే ఉంది ట్విస్టు. ఇంగ్లాండ్ ఉమెన్ టీమ్ వికెట్ కీపర్ సారా టేలర్ స్వలింగ సంపర్కురాలు. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్‌కి డియానా అనే మహిళతో కొంత కాలంగా రిలేషన్‌లో ఉంటోంది. 2016లో మెంటల్ హెల్త్ కారణాలతో క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్న సారా టేలర్.. 2019లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది...
‘అమ్మకావాలనేది నా పార్టనర్ కల. ఆ జర్నీ అంత ఈజీ కాదు. అయితే డియానా ఎప్పుడూ పట్టువదల్లేదు. ఆమె బెస్ట్ మమ్మీ అవుతుందని నాకు తెలుసు. నేను ఈ కుటుంబంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. 19 వారాల్లో జీవితం మారిపోనుంది...’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసింది సారా టేలర్...
గుడ్‌న్యూస్ చెప్పిన సారా టేలర్‌కి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘కంగ్రాట్స్ లెజెండ్. ఓ అద్భుతమైన ప్రయాణం ఎదురుచూస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు గిల్‌క్రిస్ట్.
Being a mother has always been my partner's dream. The journey hasn't been an easy one but Diana has never given up. I know she will be the best mum and I'm so happy to be a part of it x
19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e
అత్యంత అందమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సారా టేలర్, స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఒంటి మీద నూలు పోగు లేకుండా న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
ట్విట్టర్ వచ్చిన కొత్తలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, సారా టేలర్ మధ్య సాగిన ట్వీట్ల సంభాషణ తెగ వైరల్ అయ్యింది. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరిద్దరి రొమాంటిక్ సంభాషణ ట్విట్టర్ దాటి, ఎంత దూరం వెళ్లిందనేది ఎవ్వరికీ తెలీదు.
అంతేకాకుండా పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్‌గా బాధ్యతలు పూర్తి చేసి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది సారా టేలర్.అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన సారా టేలర్, దానికి ముందు ఇంగ్లాండ్ మెన్స్ కౌంటీ టీమ్ సుసెక్స్ టీమ్‌కి స్పెషలిస్ట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించింది...
అంతేకాదు ప్రొఫెషనల్ మెన్స్ క్రికెట్ టీమ్‌లో ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గానూ సారా టేలర్‌కి రికార్డు ఉంది... ఆస్ట్రేలియాలో నార్తన్ డిస్ట్రిక్స్ మెన్స్ జట్టుకి వికెట్ కీపర్‌గా ఆడింది సారా. 33 ఏళ్ల సారా టేలర్ తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరుపున 10 టెస్టు మ్యాచులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచులు ఆడింది.
టెస్టుల్లో 300 పరుగులు చేసిన సారా టేలర్, వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4056 పరుగులు చేసింది. అలాగే 90 టీ20 మ్యాచుల్లో 16 హాఫ్ సెంచరీలతో 2177 పరుగులు చేసింది. వికెట్ కీపర్‌గా 138 క్యాచులు అందుకున్న సారా టేలర్, 104 స్టంపౌట్లు చేసింది..