ధోనీ రిటైర్మెంట్ వెనక సీక్రెట్ చెప్పిన సాక్షి ధోనీ..!

By telugu news teamFirst Published Aug 16, 2023, 9:44 AM IST
Highlights

సాక్షి మంగళవారం తన అత్తగారి దేవకీ దేవికి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు చిత్రాలను పోస్ట్ చేశారు. తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ స్పెషల్ రోజున తన రిటైర్మెంట్ ప్రకటించాలని ధోనీ అనుకున్నాడట.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దాదాపు మూడేళ్ల క్రితం ఆగస్టు 15వ తేదీన తన రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ కి ఆ రోజున ఆయన వీడ్కోలు పలికారు. అయితే, ఆయన ఆరేజే తన రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించారో ఎవరికీ తెలీదు. దాని వెనక ఉన్న సీక్రెట్ ని ఆయన భార్య సాక్షి ధోనీ తాజాగా తెలియజేశారు.


ధోని భార్య సాక్షి ధోనీ మంగళవారం ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ధోనీకీ, ఆగస్టు 15వ తేదీకీ ఉన్న స్పెషల్ బాండింగ్ ని ఆమె విరించారు. ఇది MS ధోని తల్లి దేవకీ దేవి పుట్టినరోజు ఆరోజేనట. సాక్షి మంగళవారం తన అత్తగారి దేవకీ దేవికి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు చిత్రాలను పోస్ట్ చేశారు. తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ స్పెషల్ రోజున తన రిటైర్మెంట్ ప్రకటించాలని ధోనీ అనుకున్నాడట.

Latest Videos

జూలై 7, 1981న జన్మించిన పాన్ సింగ్ ధోని , దేవకీ దేవి  దంపతులకు ధోనీ జన్మించాడు. ముగ్గురు తోబుట్టువులలో 'మహి' చిన్నవాడు - నరేంద్ర సింగ్ ధోని అతని అన్నయ్య. జయంతి గుప్తా అతని అక్క.  కాగా, ధోనీ తల్లి దేవకీ దేవి తన జీవితమంతా గృహిణిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, తన అత్త గారితో తనకు చాలా మంచి బంధం ఉంది అని సాక్షి ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తాను పెళ్లికి ఒకరోజు ముందు తన అత్తగారిని కలుసుకున్నట్లు చెప్పారు. ఇఫ్పటికీ తన అత్తగారితో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాము మంచి స్నేహితుల్లాగా ఉంటామని, ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటామని చెప్పారు. తన అత్తగారు ప్రతి విషయంలోనూ తనకు మంచి సపోర్ట్ గా ఉంటారని, తన అత్తగారితో కలిసి ఉండకూడదు అనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని ఆమె చెప్పారు.


ఇదిలా ఉండగా, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. గత నెలలో 42 ఏళ్లు నిండిన ధోని, IPL 2023లో CSKని రికార్డు స్థాయిలో ఐదవ టైటిల్‌కు నడిపించాడు. 
 

click me!