వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ విగ్రహం.. ఇండియా - శ్రీలంక మ్యాచ్‌కి ముందు ఆవిష్కరణ..

ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు సచిన్ విగ్రహం.. నవంబర్ 2న ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ...

Sachin Tendulkar statue in Mumbai Wankhede Stadium Inaugurated in India vs Sri Lanka, ICC World cup 2023 CRA

భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌‌కి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 2న ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు..

అహ్మద్‌నగర్‌కి చెందిన ప్రమోద్ కంబల్ అనే శిల్ఫి ఈ విగ్రహాన్ని రూపొందించాడు. నవంబర్ 2013లో సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పదేళ్లకు ‘మాస్టర్’ విగ్రహావిష్కరణ జరగనుంది. నిజానికి ఏప్రిల్ 24న సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే పనులు పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో నవంబర్ 2న ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

Latest Videos

వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్‌కి ముందు ఈ విగ్రహం ఉండడం విశేషం. సచిన్ టెండూల్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండేస్, సచిన్ టెండూల్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆశీష్ సెలర్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కేల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు.

1989 నవంబర్ 15న పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్, 2013 నవంబర్ 14న ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్.. 100 అంతర్జాతీయ సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు చేశాడు.

1994లో ‘అర్జున’ అవార్డు దక్కించుకున్న సచిన్ టెండూల్కర్, 1997లో ‘రాజీవ్ ఖేల్‌రత్న’, 1998లో ‘పద్మశ్రీ’, 2008లో ‘పద్మ విభూషణ్’, 2013లో భారత అత్యున్నత్త పురస్కారం ‘భారత రత్న’ అందుకున్నాడు. 
 

vuukle one pixel image
click me!