దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం: టీమిండియాపై సచిన్ ప్రశంసలు

Siva Kodati |  
Published : Oct 14, 2019, 06:04 PM IST
దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం: టీమిండియాపై సచిన్ ప్రశంసలు

సారాంశం

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పుణే టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుసగా 11 సిరీస్ విజయాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. 

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పుణే టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

వరుసగా 11 సిరీస్ విజయాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ రికార్డు సాధించడానికి క్రికెటర్లు అద్భుతంగా రాణించారంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

కాగా.. పుణే టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 237 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం. 
 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?