ఐపీఎల్ లో కోల్ కతా చెత్త రికార్డు

By telugu news teamFirst Published Oct 22, 2020, 1:53 PM IST
Highlights

కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా చిత్తు చిత్తుగా ఓడింది.

ఐపీఎల్ 2020 సందడి  కొనసాగుతోంది. ఈ ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించారు. 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. 

కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా చిత్తు చిత్తుగా ఓడింది.

మొదటి ఆరు ఓవర్లు పవర్ ప్లే. అది బ్యాటింగ్ జట్టుకు ఓ వరం లాంటిది. కానీ ఆ సమయంలోనూ వికెట్ కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. పవర్ ప్లేలో స్కోర్ బోర్డులను పరుగులు పెట్టించనూవచ్చు.. వికెట్లు పడగొట్టొచకచు. కానీ కోల్ కతా జట్టు మాత్రం కంప్లీట్ గా బోల్తా పడింది.

అటు పరుగులు చేయలేక.. ఇటు బౌలింగ్ సమయంలోనూ వికెట్లు పడగొట్టలేక పవర్ ప్లేను వృథా చేసింది. పవర్ ప్లే అనగానే కోల్ కతా బౌలర్లు వణికిపోతున్నారు. ఆ జట్టు ఆడిన గత ఐదు మ్యాచుల్లో ఈ దశలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. పంజాబ్ 47/0, బెంగళూరు 47/0, ముంబయి 51/0,  హైదరాబాద్ 58/0, బెంగళూరు 44/0 ఇలా వికెట్ తీయకుండానే ప్రత్యర్థి జట్టుకి పరుగులిచ్చేసింది. 

పవర్ ప్లేలో ఆ జట్టు బౌలర్లు తీసిన వికెట్లు కేవలం 3 మాత్రమే. ఈ విషయంలో ముంబయి ది అగ్రస్థానం. 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి టాప్ లో ఉంది. పవర్ ప్లేలో కోల్ కతా బ్యాాట్స్ మెన్ ప్రదర్శన కూడా అలాగే ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మొదటి ఆరు ఓ వర్లలో 17 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు సమర్పించుకున్నారు. టీ20 సీజన్ లో ఇదే తక్కువ కావడం గమనార్హం. కోల్ కత్తాకు మాత్రం ఆల్ టైం చెత్తరికార్డు ఇది. 

click me!