RR vs MI: రాజస్థాన్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

Published : May 01, 2025, 11:10 PM IST
RR vs MI: రాజస్థాన్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

సారాంశం

IPL 2025 RR vs MI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, హర్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కు తోడుగా బుమ్రా, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ తో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. దీంతో ముంబై టీమ్ ప్లేఆఫ్స్  కు మరింత దగ్గరైంది.   

IPL 2025 RR vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 50వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ - రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి. ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్ బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టుకు మంచి ఆరంభం ల‌భించింది. ర్యాన్ రికెల్టన్ 38 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ 36 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు.  ఆ త‌ర్వాత వ‌చ్చిన హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కూడా ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. సూర్య 48 ప‌రుగులు, పాండ్యా 48 పరుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. దీంతో ముంబై జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 217 ప‌రుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు వికెట్లు తీసుకోవడంలో కష్టపడ్డారు కానీ, సక్సెస్ కాలేదు. 

218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో కూడా ఫెయిల్ అయింది. చివరలో ఆర్చర్ మినహా ఏ ఒక్క ప్లేయర్ మంచి ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ లో సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. నితీష్ రాణా 9, రియాన్ పరాగ్ 16, జురేల్ 11 పరుగులతో నిరాశపరిచారు. హిట్మేయర్ డకౌట్ అయ్యాడు. శుభం దూబే 15 పరుగులు, తీక్షణ 2 పరుగులు, కుమార్ కార్తికేయ 2 పరులుగు కొట్టారు. జోఫ్రా ఆర్చర్ చివరలో మంచి బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఆర్చర్ 30 పరుగులు చేశాడు. 16.1 ఓవర్లలో 117 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్ అయింది. 

ముంబై విజయంలో బ్యాటర్లకు తోడుగా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన బౌలింగ్ తో రాజస్థాన్ బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. బుమ్రా, బౌల్ట్, కర్ణ్ శర్మలు అద్భుతమైన బౌలింగ్ లో ఆర్ఆర్ ను దెబ్బకొట్టారు. బౌల్ట్ కు 3, కర్ణ్ శర్మకు 3 వికెట్లు పడ్డాయి. బుమ్రా కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. 

ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో 7వ విజయాన్ని అందుకుంది. దీంతో 14 పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది. ఈ సీజన్ ఆరంభం ముంబై జట్టుకు అంతబాగా కలిసి రాలేదు. కానీ, ఎప్పుడైతే బుమ్రా జట్టులోకి రావడం, రోహిత్ శర్మ ఫామ్ ను అందుకోవడం, మిగతా ప్లేయర్లు కూడా అదరగొడుతుండటంతో ముంబై జట్టు వరుస విజయాలతో ఐపీఎల్ లోని ఇతర జట్లకు దడపుట్టిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !