RRvs KXIP: మయాంక్ మెరుపులు, రాహుల్ దూకుడు... పంజాబ్ భారీ స్కోరు...

Published : Sep 27, 2020, 09:08 PM ISTUpdated : Sep 27, 2020, 09:18 PM IST
RRvs KXIP: మయాంక్ మెరుపులు, రాహుల్ దూకుడు... పంజాబ్ భారీ స్కోరు...

సారాంశం

సునామీ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్... కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్... మొదటి వికెట్‌కి 183 పరుగుల భాగస్వామ్యం...

IPL 2020లో మరోసారి భారీ స్కోరు నమోదుచేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది పంజాబ్.  టాస్ గెలిచి పంజాబ్‌కి బ్యాటింగ్ అప్పగించిన స్టీవ్ స్మిత్, కింగ్స్ ఎలెవన్ ఓపెనర్ల బ్యాటింగ్ చూసిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయానికి బాధపడి ఉండొచ్చు. మొదటి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్... ఆ తర్వాత గేరు మార్చి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లారు.

సింగిల్స్, డబుల్స్, త్రీ రన్స్... వీటన్నింటి కంటే బౌండరీలు, సిక్సర్లు బాదడమే సులభం అన్నట్టు వచ్చి బంతిని వచ్చినట్టుగా బౌండరీ దాటించారు. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ మెరుపులు మెరిపించాడు. 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. రెండో ఓవర్ నుంచే రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మయాంక్, ఏ దశలోనూ బ్రేక్ ఇవ్వకుండా బౌండరీల మోత మోగించాడు.

మరోవైపు కెఎల్ రాహుల్ కూడా తన స్టైల్‌లో బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మొదటి వికెట్‌కి రికార్డు స్థాయిలో 183 పరుగులు జోడించారు ఈ ఇద్దరూ. మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత 54 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో 69 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. చివర్లో పూరన్, మ్యాక్స్‌వెల్ కూడా బౌండరీలు బాదడంతో సీజన్‌లో అత్యధిక స్కోరు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?