ఈ కార్టూన్‌ను ఎంతమంది చూశారు... రిషబ్ పంత్‌ను ఆడుతున్న చాహాల్, రషీద్ ఖాన్...

By team teluguFirst Published Jan 25, 2021, 11:03 AM IST
Highlights

నా టీ షర్టుపైన ఉన్న కార్టూన్‌ని ఎంత మంది చూశారు.. అంటూ పిక్ పోస్టు చేసిన రిషబ్ పంత్...

పంత్‌ను ఓ ఆటాడుకున్న యజ్వేంద్ర చాహాల్, రషీద్ ఖాన్...

స్పైడర్ మ్యాన్ పాటను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు...

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్... ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో క్వారంటైన్‌లోకి వెళ్లనున్న టీమిండియా సభ్యులు, ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రిషబ్ పంత్, ఓ కార్టూన్ టీ షర్టుతో ఫోటో దిగి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు...

ఎరుపు రంగు టీ షర్టుపై టామ్ పిక్‌తో స్టైల్‌గా ఫోజిచ్చిన రిషబ్ పంత్... ‘నా టీ షర్టుపైన ఉన్న కార్టూన్‌ని ఎంత మంది చూశారు...’ అంటూ కామెంట్ పెట్టాడు. ఆసీస్ సారథి టిమ్ పైన్‌ను ఉద్దేశించి, ఈ పోస్టు పెట్టినట్టు గ్రహించినా... రిషబ్ పంత్‌ను ఓ ఆటాడుకున్నారు యజ్వేంద్ర చాహాల్, రషీద్ ఖాన్...

‘నిన్నా లేక టామ్ బ్రోనా...’ అంటూ రిషబ్ పంత్‌కి పంచ్ ఇచ్చాడు చాహాల్... ‘నేను చాలా సార్లు మీ ఇద్దరినీ చూశానులే...’ అంటూ రషీద్ ఖాన్ కామెంట్ చేశాడు. చాలామంది రిషబ్ పంత్ పాడిన ‘స్పైడర్ మ్యాన్’ పాటనే గుర్తుచేసుకుంటూ కామెంట్ బాక్సుని నింపేశారు...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

 

click me!