‘మనం గెలిచాం’ గవాస్కర్‌ను హత్తుకుని బ్రియాన్ లారా కామెంట్... ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలంటూ...

Published : Jan 24, 2021, 06:05 PM ISTUpdated : Jan 24, 2021, 06:06 PM IST
‘మనం గెలిచాం’  గవాస్కర్‌ను హత్తుకుని బ్రియాన్ లారా కామెంట్... ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలంటూ...

సారాంశం

టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహారించిన సునీల్ గవాస్కర్... టెస్టు సిరీస్ ఓటమిని ఏ మాత్రం పట్టించుకోకుండా గవాస్కర్‌ను ఛీర్ చేసిన ఆస్ట్రేలియన్లు... లిటిల్ మాస్టర్‌ను హత్తుకుని మనం గెలిచామన్న బ్రియాన్ లారా...

టీమిండియా చేతుల్లో టెస్టు సిరీస్‌ను వరుసగా రెండోసారి కోల్పోయింది ఆస్ట్రేలియా.  ఆస్ట్రేలియా అడ్డాగా చెప్పుకునే గబ్బాలో దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది యంగ్ ఇండియా. భారత జట్టు విజయంతో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఢీలా పడిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. అయితే ఆస్ట్రేలియా జనాలు మాత్రం ఈ సిరీస్‌ను తెగ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సునీల్ గవాస్కర్ ప్రకటించాడు.

టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహారించిన సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా ఛానెల్ 7 తరుపున ఇంగ్లీష్ వ్యాఖ్యతగా గడిపారు. సునీల్ గవాస్కర్‌కి ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చింది ఛానెల్ 7. ఇందులో తన గ్లాస్ తీసుకుని బ్రాడ్ కాస్ట్ రూం మొత్తం కలియతిరిగాడు సునీల్ గవాస్కర్. టెస్టు సిరీస్ ఓటమిని ఏ మాత్రం పట్టించుకోకుండా అందరూ సునీల్ గవాస్కర్‌ను ఛీర్ చేశారు.

‘‘బ్రియాన్ లారా నన్ను హత్తుకుని.. ‘మనం గెలిచాం... మనం గెలిచాం... వాట్ ఏ సిరీస్’ అంటూ అరిచాడు. ఇది క్షణాలను నేను ఎప్పటి మరిచిపోలేను... నేను ఇప్పటికీ ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను... ఇంకా అక్కడే ఆ క్షణాల్లోనే ఉండిపోయా’’ అంటూ చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్...

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే