మూడో టెస్టుకి ముందు ‘స్పైడర్‌మ్యాన్’ వర్కవుట్ చేసిన రిషబ్ పంత్, వీడియో షేర్ చేసిన సుందర్...

Published : Feb 20, 2021, 04:14 PM IST
మూడో టెస్టుకి ముందు ‘స్పైడర్‌మ్యాన్’ వర్కవుట్ చేసిన రిషబ్ పంత్, వీడియో షేర్ చేసిన సుందర్...

సారాంశం

టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ ‘స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్...’ పాట... గబ్బా విజయం తర్వాత ‘స్పైడర్‌మ్యాన్’ గెటప్‌లో కనిపించిన రిషబ్ పంత్... మూడో టెస్టు ఆరంభానికి ముందు జిమ్‌లో ‘స్పైడర్‌మ్యాన్’ వర్కవుట్స్...

ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరు, యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్‌లో నిలకడ చూపిస్తున్న రిషబ్ పంత్, వికెట్ కీపింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అజేయ హాఫ్ సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో కళ్లు చెదిరే క్యాచులు, స్టంపౌట్లు చేశాడు రిషబ్ పంత్.

ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ ‘స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్... తూనే చూరయా మేరా దిల్ కి చైన్’ అంటూ పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది.

గబ్బా టెస్టు విజయం తర్వాత స్పైడర్ మ్యాన్ గెటప్‌లో కూడా కనిపించిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకి ముందు జిమ్‌లో స్పైడర్‌మ్యాన్ వర్కవుట్లు చేశాడు.

ఈ వీడియోను షూట్ చేసిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ‘స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్ రిషబ్ పంత్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొద్దిసేపటికే పంత్ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్