డేవిడ్ మిల్లర్‌కు షాక్.. చిన్నారి మరణం.. పాపతో అనుబంధాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సఫారీ బ్యాటర్

Published : Oct 09, 2022, 11:27 AM IST
డేవిడ్ మిల్లర్‌కు షాక్.. చిన్నారి మరణం.. పాపతో అనుబంధాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సఫారీ బ్యాటర్

సారాంశం

David Miller: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కు ఊహించని షాక్ తగిలింది. తాను ఎంతో  ప్రేమగా చూసుకునే చిన్నారి మరణించింది. దీంతో మిల్లర్  శోకసంద్రంలో మునిగిపోయాడు.

సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకెంతో ఇష్టమైన చిన్నారి మరణాన్ని జీర్ణించుకోలేక మిల్లర్ శోకసంద్రంలో మునిగిపోయాడు. క్యాన్సర్ తో పోరాడుతూ మరణించిన ఆ చిన్నారిని  తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మై లిటిల్ రాక్ స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.  లవ్ యూ ఆల్వేస్’ అని ఇన్స్టాలో పోస్టు రాసుకొచ్చాడు. 

మిల్లర్ ఈ పోస్టు పెట్టేసరికి మరణించింది మిల్లర్ సొంత కూతురని అంతా భావించారు. మిల్లర్ కూతురు మరణించిందని  పలు వెబ్ సైట్లలో కథనాలు కూడా వెలువడ్డాయి. మిల్లర్ కూతురు క్యాన్సర్ తో పోరాడుతూ మరణించిందని పలు మీడియా సంస్థలు వార్తలు రాశాయి.  

అయితే మరణించిన చిన్నారి మిల్లర్ కూతురు కాదు. ఆమె అతడి క్లోజ్ ఫ్రెండ్ అని ఓ యూజర్  ట్విటర్ లో క్లారిటీ ఇచ్చాడు.  మిల్లర్ క్లోజ్ ఫ్రెండ్ కూతురైన ఆ చిన్నారి.. అతడికి  వీరాభిమాని. పాపతో ఉన్న అనుబంధం కారణంగానే అతడు ఎమోషన్ కు గురయ్యాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. 

 

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మిల్లర్.. ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ లో  భాగంగా రెండో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్ లో కూడా చివర్లో వచ్చి సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇక రెండ్రోజుల క్రితం ముగిసిన తొలి వన్డేలో  63 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  భారత జట్టు నేడు సౌతాఫ్రికాతో రెండో వన్డేలో తలపడనుంది.  రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.  

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?