తొలిసారి బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన రింకు సింగ్...!

Published : Aug 18, 2023, 11:00 AM IST
తొలిసారి బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన రింకు సింగ్...!

సారాంశం

టీమిండియా ఐర్లాండ్ తో తలపడనున్న నేపథ్యంలో రింకూ సింగ్ ని  కూడా ఎంపిక చేశారు. అయితే, తన జీవితంలో రింకూ సింగ్ మొదటి సారి విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడట.

టీమిండియా యువ క్రికెటర్ రింకు సింగ్ అందరికీ పరిచయమే. ఇటీవల ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన రింకూ సాంగ్ అదరగొట్టాడు. త్వరలోనే టీమిండియా ఐర్లాండ్ తో తలపడనున్న నేపథ్యంలో రింకూ సింగ్ ని  కూడా ఎంపిక చేశారు. అయితే, తన జీవితంలో రింకూ సింగ్ మొదటి సారి విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడట.

దీంతో, రింకూ సింగ్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఇప్పుడు అతని రియాక్షన్ హైలెట్ గా మారింది. మరో యంగ్ ప్లేయర్ జితేష్ శర్మతో కలిసి రింకు తన ఆనందాన్ని పంచుకున్నాడు. తొలిసారి బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న రింకు సింగ్ ని ఆ అనుభవం ఎలా ఉందో అడిగాడు జితేష్ శర్మ. ఈ సమయంలో రింకూ తన ఆనందాన్ని తెలియజేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


"ఇది చాలా బాగుంది. టీమ్ ఇండియా కోసం ఆడటం ప్రతి ఆటగాడి కల. నేను నా గదిలోకి ప్రవేశించి, నా జెర్సీపై నా పేరు  నంబర్ (35) ముద్రించినప్పుడు, ఆ క్షణం నాకు నిజంగా భావోద్వేగానికి గురిచేసింది. నేను చాలా కష్టపడి పనిచేశాను, నా ఎంపిక గురించి తెలుసుకున్నప్పుడు నేను నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను భారతదేశం కోసం ఆడమని నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందున నేను వెంటనే మా అమ్మను పిలిచాను, కాబట్టి ఇది ఒక కల. మా ఇద్దరికీ నిజమైంది" అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?