
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీలకి ముందు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడిన హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు..
ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్‌ని వయాకాం18కి చెందిన స్పోర్ట్స్18 ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్‌లో ఉచితంగా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచులను ప్రత్యేక్షం ప్రసారం చేస్తోంది వయాకాం18..
వెస్టిండీస్ టూర్ కంటే అరగంట ముందే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచులు ప్రారంభం అవుతాయి. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కాగా ఐర్లాండ్ టూర్‌లో మ్యాచులు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. 7 గంటలకు టాస్ జరుగుతుంది..
సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్ వంటి కొంతమంది ప్లేయర్లు మాత్రమే వెస్టిండీస్ నుంచి ఐర్లాండ్‌కి పయనమయ్యారు. దాదాపు 14 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్ టూర్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు ముందు జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌పై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఇద్దరితో పాటు ఐపీఎల్ హీరోలు రింకూ సింగ్, జితేశ్ శర్మ కూడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు..
ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో మ్యాచులన్నీ డబ్లిన్ వేదికగానే జరుగుతాయి. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడే కొందరు ప్లేయర్లు, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకకు వెళ్లబోతుంటే, మిగిలిన ప్లేయర్లు, ఆసియా క్రీడల కోసం చైనా వెళ్లబోతున్నారు..
ఆసియా క్రీడల్లో భారత జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రుతురాజ్ గైక్వాడ్, ఐర్లాండ్ సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..వెస్టిండీస్ టూర్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ, ఈ సిరీస్‌లో కూడా బాగా ఆడితే... అతనికి ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2023 టోర్నీకి ఆగస్టు 20 నాటికి జట్టును ఎంపిక చేయనుంది టీమిండియా మేనేజ్‌మెంట్. నిజానికి ఇప్పటికే ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టుని ఎంపిక చేయాల్సింది. అయితే ఐర్లాండ్ టూర్‌లో మనోళ్ల పర్ఫామెన్స్‌ని కూడా పరిగణనలోకి తీసుకునేందుకే ఆగస్టు 20 వరకూ వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు..
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: జస్ప్రిత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, రవి భిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్,ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్