ఆర్‌సీబీ జెర్సీపై నీలిరంగు.,.. కరోనాపై పోరాటం చేస్తున్నవారికి మద్ధతుగా...

By Chinthakindhi RamuFirst Published May 2, 2021, 2:54 PM IST
Highlights

రేపు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ కలర్ జెర్సీలో బరిలో దిగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు...

జెర్సీలను వేలం వేసి, వచ్చే మొత్తాన్ని ఆక్సిజన్ సరాఫరాకి వినియోగించనున్న ఆర్‌సీబీ...

ఐపీఎల్‌లో ఏటా ఓ మ్యాచ్‌ గ్రీన్ కలర్ జెర్సీలో ఆడడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా వస్తోంది. కొన్నిసీజన్లుగా ఏదో ఒక సోషల్ కాజ్ కోసం గ్రీన్ కలర్ జెర్సీలో బరిలో దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సారి కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మద్ధతుగా నిలిచేందుకు నీలిరంగు జెర్సీ ధరించనుంది.

ఆర్‌సీబీ ప్లేయర్లు ధరించిన జెర్సీలను వేలం వేసి, వచ్చిన డబ్బును దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరాఫరా కోసం వినియోగించబోతున్నారు. ‘ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుందునని భయం వేస్తోంది.

బెంగళూరుతో పాటు దేశంలోని ఇంత ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్‌సీబీ సాయం అందిస్తుంది. ఏడాది కాలంగా కరోనా నియంత్రణకోసం ముందుండి పోరాడుతున్న ఉద్యోగుల గౌరవార్థం మేం ప్రత్యేక జెర్సీ ధరించబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అవకాశం వస్తే వ్యాక్సిన్ వేసుకోండి’ అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ...

click me!