ఆర్సిబికి ఎదురుదెబ్బ... సీజన్ మొత్తానికి కీలక ఆటగాడు దూరం

By Arun Kumar PFirst Published Apr 25, 2019, 5:01 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12 ఆరంభం నుండి గెలుపుకోసం ఎదురుచూసిన ఆర్సిబికి ఈ మద్యే విజయాలు వరిస్తున్నాయి. ఆరంభంలో వరుసగా 8 మ్యాచుల్లో ఓడిపోయి లీగ్ దశనుండే ఇంటిముఖం పడుతుందా అన్న అనుమానాలను కలిగించింది. అయితే చివరి దశలో గాడిలో పడి ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిని గెలుచుకుని గెలుపు బాట పట్టింది. ఇలా ప్లేఆఫ్ పై ఇంకా ఆశలను సజీవంగా వుంచుకున్న ఆ జట్టుకు తాజాగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ మ్యాచ్ కు గాయం కారణంగా దూరమైన సౌత్ ఆఫ్రికా స్పీడ్ బౌలర్ డేల్ స్టెయిన్ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ఆర్సిబి యాజమాన్యం ప్రకటించింది. 

ఆర్సిబి జట్టులోకి ఆలస్యంగా ప్రవేశించిన స్టెయిన్ పంజాబ్ తో కంటే ముందు జరిగిన రెండు మ్యాచులు ఆడాడు. కోల్‌కతా, చెన్నైలతో జరిగిన మ్యాచుల్లో ఇతడు రెండేసి వికెట్ల చెప్పున  మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తనవంతు పాత్ర వహించాడు. అయితే ఆ తర్వాత అతడి భుజం గాయం తిరగబెట్టడంతో బుధవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. 

అయితే స్టెయిన్ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు అతడికి చాలా రోజులు విశ్రాంతి అవసరమని సూచించారని ఆర్సిబి ఛైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు. కాబట్టి అతడి ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మిగతా మ్యాచుల్లో కూడా ఆడించవద్దని నిర్ణయించామన్నారు. ఇలా ఈ సీజన్ మొత్తానికి స్టెయిన్ దూరం కానున్నాడని  వెల్లడించారు. అతడి సేవలనే ఆర్సిబి కోల్పోతోందని...అయితే అతడి ఆరోగ్యం కంటే తమకేదీ ముఖ్యం కాదన్నారు. స్టెయిన్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు సంజీవ్  వెల్లడించారు. 

దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ కోసం ఎంపికచేసిన 15 మంది ఆటగాళ్లలో స్టెయిన్ ఒకడు. వచ్చే నెలలోనే ఈ మెగా టోర్నీ జరగనుంది. కాబట్టి అప్పటివరకు అతడు కోలుకోకపోతే ప్రపంచ కప్ కు దూరమయ్యే అవకాశాలున్నాయి. 
 
click me!