ఐసీసీ ట్వీట్: భారత కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ హీట్

Published : Oct 13, 2019, 04:23 PM ISTUpdated : Oct 13, 2019, 06:24 PM IST
ఐసీసీ ట్వీట్:  భారత కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ హీట్

సారాంశం

సరదాగా నేటి ఉదయం రవిశాస్త్రి రెండు చేతులను చాచి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి కాప్షన్ పెట్టమని క్రికెట్ అభిమానులను కోరింది ఐసీసీ. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టని నేటి తరం ఈ ట్వీట్ కి తమదైన స్టయిల్లో రెప్లైలు ఇచ్చారు. రవిశాస్త్రి జీవన శైలిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

సరదాగా నేటి ఉదయం రవిశాస్త్రి రెండు చేతులను చాచి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి కాప్షన్ పెట్టమని క్రికెట్ అభిమానులను కోరింది ఐసీసీ. ట్వీట్ పెట్టి దాదాపు 8గంటలయింది. అప్పటికే 224 రీట్వీట్లు,దాదాపు 9వేల లైకులను సొంతం చేసుకుంది. 

ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టని నేటి తరం ఈ ట్వీట్ కి తమదైన స్టయిల్లో రెప్లైలు ఇచ్చారు. రవిశాస్త్రి జీవన శైలిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. గతంలో తాను పెట్టిన ఫోటోలు ట్రోల్ అయ్యేవి, ఇప్పుడు మాత్రం తనకేం సంబంధం లేకుండానే రవిశాస్త్రిని ఆన్ లైన్ లో రోస్ట్ చేసేస్తున్నారు. 

ఒకరేమో టైటానిక్ సినిమాలో ఓడ అంచున హీరో హీరోయిన్ నిలుచునే సీన్ లో హీరోయిన్ మొఖాన్ని రావిశాస్త్గ్రి మొఖంతో మార్ఫ్ చేస్తే, మరొకరేమో మందు గ్లాసులను అతగాడి చేతుల్లో పెట్టారు. ఏదైతేనేం రవిశాస్త్రి మాత్రం మరో మారు బీభత్సంగా  ట్రోల్ అవుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?