రోహిత్ గాయం గురించి విరాట్ కోహ్లీ చెప్పాల్సిన బాధ్యత రవిశాస్త్రిదే... మరి ఏం చేస్తున్నాడు?

By team teluguFirst Published Dec 2, 2020, 4:23 PM IST
Highlights

రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి మధ్య అంతరం పెరుగుతుంటే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్...

హెడ్ కోచ్‌తో పాటు ఫిజియో, బీసీసీఐ సెలక్టర్లదీ తప్పు ఉందన్న గౌతీ..

INDvsAUS: అనేక అవరోధాలను అధిగమించి యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020, బీసీసీఐకీ కాసుల వర్షం కురిపించినా భారత జట్టులో విభేదాలను బహిర్గతం చేసింది. రోహిత్ శర్మ గాయపడడం, ఆ తర్వాత కోలుకుని ముంబై ఇండియన్స్ తర్వాత మూడు వన్డేల్లో బరిలో దిగడం... రోహిత్ గాయం గురించి తనకి సమాచారం లేదని విరాట్ కోహ్లీ వెల్లడించం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటన తర్వాత కళ్లు తెరిచిన బీసీసీఐ, కోచ్ రవిశాస్త్రితో ఆధ్వర్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో వీడియో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసింది. అయితే రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి మధ్య అంతరం పెరుగుతుంటే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి చూస్తూ ఎందుకు కూర్చున్నాడని నిలదీశాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. 

‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండి, తన వైస్ గాయం గురించి తెలియదని చెప్పడం దురదృష్టకరం. భారత జట్టులో ఈ పరిస్థితికి సెలక్టర్లు, హెడ్ కోచ్, ఫిజియో కూడా కారణం. విరాట్ కోహ్లీకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వీరిపై ఉంది... 

ముఖ్యంగా నిత్యం కోహ్లీతో ఉండే కోచ్ రవిశాస్త్రి ఏం చేస్తున్నాడు. ఇద్దరి ఆటగాళ్ల మధ్య మనస్ఫర్థలు పెరుగుతుంటే చూస్తూ కూర్చున్నాడా’ అంటూ ప్రశ్నించాడు గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాపై రెండు వన్డేలు ఓడిన తర్వాత కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రవిశాస్త్రిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అభిమానులు.

click me!
Last Updated Dec 2, 2020, 4:23 PM IST
click me!