పదిహేను రోజుల క్రితం కూతురు.. ఇప్పుడు నాన్న.. వరుసగా రెండు షాక్ లు.. అయినా జట్టును వీడని క్రికెటర్

Published : Feb 28, 2022, 02:54 PM IST
పదిహేను రోజుల క్రితం కూతురు.. ఇప్పుడు నాన్న.. వరుసగా రెండు షాక్ లు.. అయినా జట్టును వీడని క్రికెటర్

సారాంశం

Vishnu Solanki: పదిహేను రోజుల్లోనే రెండు విషాదాలు.. ముందు  కూతురు.. ఇప్పుడు నాన్న.. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా  బాధను దిగమింగడం కష్టమే.. కానీ.. 

కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతేనే ఆ బాధను భరించడం కష్టం. అటువంటిది పదిహేను రోజుల  వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం.   ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు బరోడా ఆల్ రౌండర్  విష్ణు సోలంకి. ఈ నెల 10న అతడి  కూతురు.. పుట్టిన మరునాడే కన్నుమూయగా.. ఇప్పుడు సోలంకి తండ్రి కూడా మరణించాడు. రంజీ ట్రోపీలో భాగంగా బరోడా తరఫున ఆడుతున్న  విష్ణు.. తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా జట్టు కోసం బయో బబుల్ లోనే గడుపుతున్నాడు. 

ఫిబ్రవరి 10న విష్ణు సోలంకి భార్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ మరుసటి రోజే ఆ చిన్నారి.. ఇంకా ప్రపంచాన్ని చూడకముందే  కండ్లు మూసింది.  రంజీ సీజన్ లో భాగంగా బయో బబుల్ లో ఉన్న సోలంకి.. ఈ బాధను దిగమింగి మరీ ఇటీవలే చండీగఢ్ తో ముగిసిన రంజీ మ్యాచులో  శతకం బాదాడు. 

కూతురు చనిపోయిన విషయాన్ని  ఇంకా మరిచిపోకముందే సోలంకికి మరో షాక్ తగిలింది.  ఆదివారం (ఫిబ్రవరి 27న) అతడి తండ్రి  కూడా మరణించాడు. అయితే  కఠినమైన బయో బబుల్ ఆంక్షల నడుమ ఉన్న సోలంకి.. తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు.  వీడియోకాల్ లో ఆ తంతును పూర్తి చేశాడు.

 

ఇదే విషయమై  బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి  మాట్లాడుతూ..  కుమార్తె మరణం తర్వాత  కుటుంబంతో ఉండమని  సోలంకికి  సూచించాం. కానీ అతడు మాత్రం జట్టు కోసం బబుల్ లోనే ఉండిపోయాడు.  ఇప్పుడు అతడి  తండ్రి కూడా మరణించడం బాధాకరం.  ఈ రెండు విషాధాలను దిగమింగుతూ  సోలంకి జట్టు కోసం రాణిస్తుండటం చూస్తే అతడిపై  గౌరవం మరింత పెరుగుతుంది..’ అని తెలిపాడు. 

 

రంజీ సీజన్ 2022లో భాగంగా ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న బరోడా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు  మార్చి 3 నుంచి హైదరాబాద్ తో తలపడునున్నది. ఈ గ్రూప్ లో రెండు మ్యాచులు గెలిచిన బెంగాల్ అగ్రస్థానంలో ఉండగా.. చెరో మ్యాచ్ గెలిచిన హైదరాబాద్ రెండు, బరోడా మూడో స్థానాల్లో ఉన్నాయి.  ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని  చండీగఢ్.. నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.     
 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు