ద్రవిడ్ కన్నా రాహుల్ మెరుగైన వికెట్ కీపర్, కానీ....

By telugu teamFirst Published Jan 19, 2020, 4:52 PM IST
Highlights

రాహుల్ తాజా ప్రదర్శన అతడిని టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పోలికలకు కారణమైంది. జట్టు కోసం 70కి పైగా వన్డేల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్ కీపర్‌గానూ సేవలు అందించాడు. 

మొన్నటి రాజ్ కోట్ మ్యాచులో బాగా హాట్ టాపిక్ గా ఎవరి మీదనో చర్చ సాగిందంటే, అది ఖచ్చితంగా రాహుల్ పైన్నే. 

లకమైన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. భారత్ చేసిన భారీ స్కోర్ ను చేధించే క్రమంలో ఆస్ట్రేలియా పోరాడి ఓడింది.

భారత్ విసిరిన లక్ష్య ఛేదన సవాల్ ను స్వీకరించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే వార్నర్ వికెట్ రూపంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత కెప్టెన్ ఫించ్ ను కెఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ తో పెవిలిన్ చేర్చాడు. 

16వ ఓవర్లో రవీంద్రజడేజా వేసిన బంతిని ఆడబోయి అది కాస్త మిస్ అయింది. దాన్ని చాకచక్యంగా అందుకున్న రాహుల్ రెప్పపాటులో వికెట్లను గిరాటేసాడు. రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ నైపుణ్యంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా అవాక్కయింది.

రాహుల్ ఫినిషర్ గా కూడా తానేమిటో మొన్నటి మ్యాచులో ప్రూవ్ చేసుకున్నాడు. రాహుల్ మెరుపులతోనే నిన్న భారత్ అంత భారీ స్కోర్ చేయగలిగింది.ఇక రాహుల్ ఇన్నింగ్స్ గురించి, అతడి కీపింగ్ నైపుణ్యాలను గురించి తెగ చర్చించుకుంటున్నారు. 

రాహుల్ తాజా ప్రదర్శన అతడిని టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పోలికలకు కారణమైంది. జట్టు కోసం 70కి పైగా వన్డేల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్ కీపర్‌గానూ సేవలు అందించాడు. 

వికెట్ల వెనక కూడా రాహుల్ ద్రవిడ్ రాణించడంతో రాహుల్ కిసైతం రెండు బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 

రాహుల్ ద్రవిడ్ కంటే కేఎల్ రాహుల్ మెరుగైన వికెట్ కీపేరేనని కితాబిచ్చాడు. అయినప్పటికీ రాహుల్‌కు రెండు బాధ్యతలు అప్పగించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. 

అతడిని రెగ్యులర్‌ వికెట్ కీపర్ గా కొనసాగించడాన్నీ మాత్రం తాను కోరుకోవడం లేదన్నాడు. 50 ఓవర్లు కీపింగ్ చేసి, ఆపై ఆ రేంజ్ లో బ్యాటింగ్ చేయడం కష్టమని పేర్కొన్నాడు. జట్టు అవసరాల కోసం ఎప్పుడో ఒకసారి అయితే ఇలా కీపింగ్ చేయడం ఓకే, కానీ దీర్ఘకాలంలో అది చేటు చేస్తుందని ఆకాశ్ చోప్రా రాహుల్ పై తన మనసులోమాటను బయటపెట్టాడు. 

click me!