రెచ్చిపోయిన రెహ్మనుల్లా గుర్భాజ్... శ్రీలంక ముందు భారీ లక్ష్యం పెట్టిన ఆఫ్ఘనిస్తాన్...

Published : Sep 03, 2022, 09:40 PM ISTUpdated : Sep 03, 2022, 09:41 PM IST
రెచ్చిపోయిన రెహ్మనుల్లా గుర్భాజ్... శ్రీలంక ముందు భారీ లక్ష్యం పెట్టిన ఆఫ్ఘనిస్తాన్...

సారాంశం

Sri Lanka vs Afghanistan: 84 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్... ఆసియా కప్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు... 

ఆసియా కప్ 2022 ప్లేఆఫ్స్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్భాజ్ మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది... 5 ఓవర్లు ముగిసే సమయానికే 46 పరుగులు చేసింది ఆఫ్ఘాన్... 

16 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన హజ్రతుల్లా జజాయిని అవుట్ చేసిన దిల్షాన్ మదుశనక, లంకకి తొలి బ్రేక్ అందించాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రెహ్మనుల్లా గుర్భాజ్, ఆసియా కప్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు... అంతేకాదు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో రెహ్మనుల్లా గుర్బాజ్ చేసిన 84 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు 2016 ఆసియా కప్ టీ20 ఎడిషన్‌లో రోహిత్ శర్మ చేసిన 83 పరుగుల స్కోరును రెహ్మనుల్లా గుర్భాజ్ అధిగమించాడు.. 

ఇంతకుముందు 2014 ఆసియా కప్‌లో పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని, గుర్భాజ్ కంటే ముందున్నాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్... అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో హసరంగకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

రెహ్మనుల్లా గుర్భాజ్‌తో కలిసి రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇబ్రహిం జాడ్రాన్ 38 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి దిల్షాన్ మదుశకన బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

కెప్టెన్ మహ్మద్ నబీ 4 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి మహ్మద్ నబీ అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన నజిబుల్లా జాద్రాన్ రనౌట్ అయ్యాడు...

7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన రషీద్ ఖాన్... ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఒకానొక దశలో 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 151/2 స్కోరుతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !