అవన్నీ బ్యాట్ కొసలకు తాకినవే.. బుమ్రా గొప్పతనమేమీ లేదు.. : బ్రాడ్ ను వెనకేసుకొస్తున్న ఇంగ్లాండ్

Published : Jul 04, 2022, 11:08 AM IST
అవన్నీ బ్యాట్ కొసలకు తాకినవే.. బుమ్రా గొప్పతనమేమీ లేదు.. : బ్రాడ్ ను వెనకేసుకొస్తున్న ఇంగ్లాండ్

సారాంశం

ENG vs IND: ఇండియా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో బుమ్రా వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. బుమ్రా దెబ్బకు బ్రాడ్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు (35) ఇచ్చుకున్న బౌలర్ గా చెత్త రికార్డు సాధించాడు. 

తప్పు తమ వైపు ఉన్నా అహం అడ్డొచ్చి దానిని ఒప్పుకోలేక ఇతరుల మీదకు నెడుతుంటారు కొందరు. అదే  సమయంలో ఇతరుల గొప్పతనాన్ని కూడా అంగీకరించడానికి మనసొప్పక ఆ పనులను తక్కువ చేసి చూపుతుంటారు. రెండింట్లో కామన్ గా కనిపించేది ఓర్వలేనితనమే.. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా అదే  వ్యాధితో బాధపడుతున్నాడు. అండర్సన్ ఓర్వలేనితనానికి కారణం తన సహచర ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్  బౌలింగ్ ను  టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా బండకేసి కొట్టడమే. ఎడ్జబాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  బుమ్రాకు బౌలింగ్ వేసిన బ్రాడ్.. ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఈ విధ్వంసాన్ని బ్రాడ్ ఎలా తీసుకున్నాడో తెలియదు గానీ అండర్సన్ మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా బుమ్రా బ్యాటింగ్ పై అండర్సన్ కామెంట్స్ చూస్తే అదే సందేహం రాకమానదు. 

బుమ్రా బ్యాటింగ్ విన్యాసాలపై అండర్సన్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం (బుమ్రా బ్యాటింగ్) అతని అదృష్టమే తప్ప మరేం లేదు. మిగతా రోజుల్లో అయితే అవే షాట్లు నేరుగా ఫీల్డర్ల చేతిలోకి వెళ్తాయి. కానీ ఈ మ్యాచ్ లో అలా జరగలేదు. బుమ్రా ఆడిన షాట్లన్నీ బ్యాట్ ఎడ్జ్ కు తాక్కుంటూ వెళ్లినవే. బ్రాడ్ కాస్త దురదృష్టవంతుడు.... 

అసలు మా ప్లానే అది. బ్యాట్ కు అనుగుణంగా బంతులు వేస్తే టెయిలెండర్లు టెంప్ట్ అయ్యేలా షాట్లు ఆడతారు. అవి నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్తాయి.  మా కెప్టెన్  స్టోక్స్ కూడా బ్రాడ్ కు అదే చెప్పాడు. బ్రాడ్ దానిని అనుసరించాడు. కానీ అదృష్టం బుమ్రా వైపు ఉంది అంతే..’ అని తన అక్కసు వెళ్లగక్కాడు. 

 

ఒకవైపు తన రికార్డును బద్దలుకొట్టినందుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (టెస్టులలో ఒకే ఓవర్లో 28 పరుగులు సాధించడం) సైతం బుమ్రా ను అభినందిస్తుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం  పై విధంగా స్పందించడం గమనార్హం. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు