క్యాసినో క్లబ్‌లో పీసీబీ అధికారులు... వన్డే వరల్డ్ కప్‌కి ముందు చిక్కుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు...

By Chinthakindhi Ramu  |  First Published Sep 11, 2023, 5:33 PM IST

క్యాసినోలో కనిపించిన మీడియా మేనేజర్ ఉమర్ ఫరూక్ కల్సన్, పీసీబీ జనరల్ మేనేజర్ అద్నన్ అలీ... డిన్నర్ కోసమే వెళ్లామంటూ.. 


ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా.. ఆఖరికి శ్రీలంక అయినా పరువు పోగొట్టుకోవడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందుంటుంది.  హైబ్రీడ్ మోడల్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2023 టోర్నీ కోసం కొలంబోలో ఉన్న పాకిస్తాన్ జట్టు, తాజాగా మరో కొత్త వివాదంలో ఇరుక్కుంది..

లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో సూపర్ 4 మ్యాచ్ ముగించుకున్న పాకిస్తాన్ జట్టు, మిగిలిన మ్యాచుల కోసం కొలంబోకి చేరుకుంది. పాక్ జట్టుతో పాటు మీడియా మేనేజర్ ఉమర్ ఫరూక్ కల్సన్, పీసీబీ జనరల్ మేనేజర్ అద్నన్ అలీ కూడా కొలంబోలో ఉన్నారు..

Latest Videos

undefined

వర్షం కారణంగా మ్యాచులు వాయిదా పడుతుండడంతో బోర్‌గా ఫీల్ అయ్యారేమో, ఉమర్ ఫరూక్, అద్నన్ ఆలీ కలిసి కొలంబోలోని ఓ క్యాసినోలో ప్రత్యేక్షమయ్యారు. ఈ ఇద్దరూ క్యాసినోలో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ, గ్యాబ్లింగ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూల్స్ ప్రకారం ఓ జట్టు, ఏ దేశంలోనైనా క్రికెట్ టోర్నీ కోసం పర్యటిస్తున్నప్పుడు పర్యాటక జట్టు ప్లేయర్లు, అధికారులు క్యాసినోకి వెళ్లకూడదు. అధికారిక పర్యటన ముగిసిన తర్వాత వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉమర్ ఫరూక్, అద్నన్ ఆలీ స్పందించారు. ‘కొలంబోలో ఎక్కడ ఫుడ్ బాగుంటుందని అడిగితే, హోటల్ సిబ్బంది ఇక్కడ బాగుంటుందని చెప్పారు. అందుకే కేవలం డిన్నర్ కోసం మాత్రమే అక్కడికి వెళ్లాం...’ అంటూ కామెంట్ చేశాడు ఉమర్ ఫరూక్..

మొన్న ఎవరో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, బజ్జీలు తినడానికి పబ్‌కి వెళ్లానని చెప్పినట్టుగా, క్యాసినోకి డిన్నర్ కోసం వెళ్లడం ఏంటని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. అయితే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం పాక్ క్రికెట్ బోర్డుకి కొత్తేమీ కాదు. 


2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో సౌతాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్‌లో మహ్మద్ ఆసీఫ్, షోయబ్ అక్తర్ గొడవ పడడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఈ గొడవ కారణంగా షోయబ్ అక్తర్, టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పించబడ్డాడు.. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో కరోనా నిబంధనలను ఫాలో అవ్వకుండా వివాదాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్ జట్టు.. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులు, క్రికెటర్ల అరెస్టులు, క్రికెటర్లపై రేప్ కేసులు నమోదు కావడం...  ఇలాంటి వివాదాలు పాక్ క్రికెట్ చరిత్రలో కోకొల్లలు. 

పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై కూడా ఛీటింగ్ కేసు నమోదైంది. అలాగే యాసిర్ షాపై కూడా మైనర్ బాలికపై అత్యాచారం కేసు నడుస్తోంది. అయితే ప్లేయర్లపై క్రిమినల్ కేసులు ఉన్నా, వాటికి కేవలం వారి వ్యక్తిగత విషయాలుగా పరిగణిస్తామని చెప్పుకొచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 

click me!