PSL: ఇరగదీశావ్ అల్లుడు.. అచ్చం నాలాగే బ్యాటింగ్ చేశావ్..! షాహీన్ అఫ్రిది పై మామ ప్రశంసలు

Published : Feb 22, 2022, 10:44 AM IST
PSL: ఇరగదీశావ్ అల్లుడు..  అచ్చం నాలాగే బ్యాటింగ్ చేశావ్..! షాహీన్ అఫ్రిది పై మామ ప్రశంసలు

సారాంశం

Shahid Afridi Praises Shaheen Afridi: స్పిన్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన పాకిస్థాన్ వెటరన్ ఆల్ రౌండర్ షాహీద్ అఫ్రిది..  బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇప్పుడు అతడి కాబోయే అల్లుడు కూడా అదేబాటలో నడుస్తున్నాడు.  

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా  లాహోర్ ఖలండర్స్ కు  సారథ్యం వహిస్తున్న పాక్ నయా పేస్ సంచలనం  షాహీన్ అఫ్రిదిపై.. అతడికి కాబోయే మామ, మాజీ ఆల్ రౌండర్ షాహీద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ లో ఇరగదీసిన అతడిని.. ‘అచ్చం నాలాగే ఆడావ్.. ’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.  పీఎస్ఎల్-2022లో భాగంగా  సోమవారం లాహోర్ ఖలండర్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన  మ్యాచులో  అఫ్రిది  ఇరగదీశాడు. 20 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో  39 పరుగులు చేసి.. మామ లాగే తాను కూడా బౌలింగే కాదు బ్యాటింగ్ లో కూడా రాణించగలనని రుజువు చేశాడు. అఫ్రిది కూతురుతో షాహీన్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది ఈ జంట పెండ్లి చేసుకునే అవకాశముంది. 

సోమవారం ముగిసిన మ్యాచులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ కు దిగిన  లాహోర్ ముందు.. పెషావర్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన లాహోర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి  158 పరుగులు చేసింది. 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సారథి షాహీన్ అఫ్రిది  ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో.. మెరుపులు మెరిపించాడు.  అతడి ఇన్నింగ్స్ లో నాలుగు  భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. 

 

కాబోయే అల్లుడి బ్యాటింగ్ విన్యాసాలను చూసిన షాహిద్ అఫ్రిది.. మ్యాచ్ అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించాడు.  అచ్చం తన ఫోటోను పోలి ఉన్న షాహీన్ అఫ్రిది చిత్రాన్ని కలిపి కొలేజ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేగాక దానికి ‘షాహీన్ అఫ్రిది.. యూ బ్యూటీ...’ అని  రాసుకొచ్చాడు.  ఈ ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

 

కాగా..  ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచు లో విజయం మాత్రం పెషావర్ నే వరించింది.  తొలుత  పెషావర్ జల్మీ నిర్ణీత 20  ఓవర్లలో 158 పరుగులు చేసింది. షోయభ్ మాలిక్ (32) రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లాహోర్.. 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ (49)  సాయంతో షాహీన్ అఫ్రిది మెరుపులు మెరిపించాడు. జట్టును విజయం అంచుల దాకా తీసుకువచ్చాడు. కానీ చివరికి  మ్యాచ్ టై అయింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. సూపర్ ఓవర్ లో పెషావర్ నే విజయం వరించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !