పెళ్లికి బాజా మోగింది.. నేటి రాత్రికే నిఖా చేసుకోనున్న పాక్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది..

Published : Feb 03, 2023, 06:00 PM ISTUpdated : Feb 03, 2023, 06:01 PM IST
పెళ్లికి బాజా మోగింది.. నేటి రాత్రికే నిఖా చేసుకోనున్న పాక్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది..

సారాంశం

Shaheen Afridi Wedding:  పాకిస్తాన్ పేసర్ షాహీన్  షా అఫ్రిది  నేటి రాత్రికి   ఓ ఇంటివాడు కానున్నాడు.  ఆ జట్టు  మాజీ ఆల్ రౌండర్  షాహీద్ అఫ్రిది  కూతురు అన్షాను వివాహం చేసుకోనున్నాడు. 

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది.  ముఖ్యంగా క్రికెటర్లు  రాబోయే బిజీ షెడ్యూల్స్ దృష్ట్యా పెళ్లి బాట పడుతున్నారు. పాకిస్తాన్ యువ  పేసర్ షాహీన్ షా అఫ్రిది  కూడా నేటి రాత్రికి పెళ్లి చేసుకోబోతున్నాడు.  రెండేండ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్న షాహీన్..  బుధవారం రాత్రి  పెళ్లి  కొడుకు కాబోతున్నాడు.  పాక్ మాజీ ఆల్ రౌండర్  షాహిద్ అఫ్రిది  కూతురు అన్షాతో షాహీన్..  కరాచీలో వివాహం చేసుకోనున్నాడు. ఈ పెళ్లికి పాకిస్తాన్  క్రికెటర్లు తరలిరానున్నారు. 

షాహీన్  తో అన్షూ  ఎంగేజ్మెంట్ రెండేండ్ల క్రితమే జరిగిన విషయం తెలిసిందే. అయితే  మధ్యలో తనకున్న క్రికెట్ షెడ్యూల్ వల్ల  షాహీన్  పెళ్లి  వాయిదా వేస్తూ వచ్చాడు.  కానీ గతేడాది  నుంచి అతడు గాయాలతో సతమతమవుతున్నాడు.  

2021 జులైలో శ్రీలంక టూర్ లో గాయపడ్డ షాహీన్.. ఆసియా కప్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ లో పిట్నెస్ లేకున్నా ఆడిన అతడు తర్వాత మళ్లీ గాయపడి  జట్టుకు దూరమయ్యాడు.   ఇక పాకిస్తాన్ టీమ్ కూడా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తర్వాత   మ్యాచ్ లు లేకుండా  ఖాళీగానే ఉంది. ఇదే మంచి సమయమని భావించిన అఫ్రిది..  పెళ్లికి సిద్ధమయ్యాడు.   నేటి రాత్రి   కుటుంబసభ్యులు, బంధువులు, సహచర క్రికెటర్ల సమక్షంలో  షాహీన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 

 

పెళ్లిల్ల సీజన్ :  గత నెల రోజులుగా  పలువురు క్రికెటర్లు పెళ్లి కొడుకులయ్యారు. వారిలో.. 

- కెఎల్ రాహుల్ 
- అక్షర్ పటేల్ 
- షాన్ మసూద్ (పాకిస్తాన్) 
- షాదాబ్ ఖాన్  
- హరీస్ రౌఫ్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో షాహీన్ కూడా చేరాడు. 

 

ఇక 22 ఏండ్ల షాహీన్ ఇదివరకు తన కెరీర్ లో  25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.  టెస్టులలో 99, వన్డేలలో 62, టీ20లలో 58 వికెట్లు పడగొట్టాడు.  హరీస్ రౌఫ్, నసీమ్ షా లతో కలిసి షాహీన్.. పాకిస్తాన్ బౌలింగ్ కు పూర్వపు వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !