హెడ్‌కోచ్ కూతురును పెళ్లాడిన పాకిస్తాన్ ఆల్ రౌండర్.. షాదాబ్ ఖాన్ మాములోడు కాదుగా...

Published : Jan 24, 2023, 01:44 PM IST
హెడ్‌కోచ్ కూతురును పెళ్లాడిన పాకిస్తాన్ ఆల్ రౌండర్.. షాదాబ్ ఖాన్ మాములోడు కాదుగా...

సారాంశం

Shadab Khan Wedding: పాకిస్తాన్  జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్న షాదాబ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు.   టీమ్ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ కూతురినే అతడు వివాహమాడాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

ప్రస్తుతం  పెళ్లిల్ల సీజన్ జోరుగా సాగుతోంది.  టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ - బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం నిన్న  ఖండాలా (మహారాష్ట్ర) లో ఘనంగా జరిగింది. భారత్ తో పాటు  పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా  గత వారంలో  పెళ్లిల్లు చేసుకున్నారు. వారం రోజుల క్రితం ఆ జట్టు  స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ తో పాటు రెండ్రోజుల క్రితం షాన్ మసూద్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న  ఆ టీమ్ స్పిన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు. 
 
పాకిస్తాన్  క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న  సక్లయిన్ ముస్తాక్  పెద్ద కూతురినే షాదాబ్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి  కుటుంబసభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా షాదాబ్ ఖానే తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించాడు.  

సక్లయిన్ ముస్తాక్ కు  ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. సక్లయిన్  పెద్ద కూతురిని షాదాబ్ వివాహమాడాడు.   ఇదే విషయమై  షాదాబ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈరోజు నా  నిఖా. ఇది నా జీవితంలో చాలా కీలకమైన  క్షణం, కొత్త అధ్యాయానికి నాంది. నేను క్రికెటర్ గా ఉన్నప్పట్నుంచి నా కుటుంబం   ప్రైవసీని కోరుకుంటుంది.   నా భార్య కూడా అదే  కోరింది.  మా  ప్రైవసీని గౌరవించగలరని మనవి.   మీరు ఏమైనా కట్నాలు పంపదలుచుకుంటే  నేను  నా అకౌంట్ నంబర్ ఇస్తాను...’ అని  ట్వీట్ చేశాడు.    

 

షాదాబ్  పెళ్లిపై పాకిస్తాన్ క్రికెటర్లు అతడికి విషెస్ చెబుతున్నారు. తన సహచర ఆటగాళ్లైన  ఇమామ్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ లు ట్విటర్ లో షాదాబ్ కు విషెస్ చెప్పారు.  ఇక షాదాబ్  పాకిస్తాన్ తరఫున ఆరు టెస్టులు, 53 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. టెస్టులలో  14, వన్డేలలో 70, టీ20లలో 98 వికెట్లు పడగొట్టాడు.  బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించే  షాదాబ్.. టెస్టులలో 300, వన్డేలలో 596, టీ20లలో 476 పరుగులు చేశాడు.  ఇక అతడి  మామ, పాక్ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్..   49 టెస్టులు ఆడి  208 వికెట్లు తీయగా 169 వన్డేలలో 288 వికెట్లు తీసి  పాకిస్తాన్ స్పిన్నర్లలో   దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఈ మామ అల్లుళ్లు కలిసి త్వరలోనే  మళ్లీ   ఫీల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నారు.  

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇది కదా కిర్రాకెక్కించే వార్త.. బెంగళూరులోనే RCB మ్యాచ్‌లు.. ఇక గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే
T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్