ఆడేది పాకిస్తాన్ లీగ్‌లో.. పెట్టుకున్నది బంగ్లాదేశ్ లీగ్ హెల్మెట్.. పాక్ యువ పేసర్‌కు జరిమానా

Published : Feb 18, 2023, 04:50 PM IST
ఆడేది పాకిస్తాన్ లీగ్‌లో.. పెట్టుకున్నది బంగ్లాదేశ్  లీగ్ హెల్మెట్.. పాక్ యువ పేసర్‌కు జరిమానా

సారాంశం

PSL 2023: పాకిస్తాన్ యువ పేసర్  నసీమ్ షా కు ఆ దేశ క్రికెట్ బోర్డు జరిమానా విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడుతూ అతడు  మరో లీగ్ హెల్మెట్ పెట్టుకున్నాడు. 

యువ  బౌలర్ నసీమ్ షా కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది.  పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా  క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున  ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ కుర్రాడు.. తాను ఆడుతున్నది పీఎస్ఎల్ లో అని మరిచిపోయినట్టున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో  కొమిల్లా విక్టోరియన్స్ హెల్మెట్ ధరించాడు. పీఎస్ఎల్ లో భాగంగా   రెండ్రోజుల క్రితం  క్వెట్టా గ్లాడియేటర్స్  వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ జరిగింది.  ఈ  లీగ్ లో క్వెట్టా తరఫున ఆడుతున్న  నసీమ్ షా..  బ్యాటింగ్ కు వేరే లీగ్ హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు. 

నసీమ్ షా ఇటీవలే  బీపీఎల్ లో కొమిల్లా విక్టోరియన్స్ కు ఆడాడు. అదే హెల్మెట్ ను పీఎస్ఎల్ లో కూడా వాడాడు.   ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.  ఈ ఫోటోపై  నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఆడేది పీఎస్ఎల్ లో హెల్మెట్  మాత్రం  బీపీఎల్ దా..? ఇదేం ఖర్మ మాకు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇక క్వెట్టా - ముల్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో  ముల్తాన్ జట్టు   సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత  క్వెట్టా.. 18.5 ఓవర్లలో   110 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో  జేసన్ రాయ్  (27) టాప్ స్కోరర్.  ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్  ఇహ్సానుల్లా  ఐదు వికెట్లతో చెలరేగాడు.   అనంతరం స్వల్ప లక్ష్యాన్ని  ముల్తాన్..  13.3 ఓవర్లలోనే  ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.  రిలీ రోసో (42  బంతుల్లో 78,  9 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) లు ఆ జట్టుకు విజయాన్ని అందించారు.   ఈ లీగ్ లో క్వెట్టా తమ తదుపరి మ్యాచ్ లో  భాగంగా నేడు కరాచీ కింగ్స్ తో తలపడనుంది. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !