మా జట్టు గురించి తర్వాత ఆలోచిద్దువులే.. ముందు నీ దేశం ఆట చూసుకో.. పాకిస్తాన్ నటిపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం

Published : Sep 21, 2022, 12:56 PM IST
మా జట్టు గురించి తర్వాత ఆలోచిద్దువులే.. ముందు నీ దేశం ఆట చూసుకో.. పాకిస్తాన్ నటిపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం

సారాంశం

IND vs AUS T20I: టీమిండియా  ఆటతీరుపై పాకిస్తాన్ కు చెందిన నటి  సెహర్ షిన్వారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. వచ్చే టీ20 ప్రపంచకప్ లో కూడా పాకిస్తాన్ పై భారత్ ఓడిపోవాలని  చేసిన కామెంట్స్ కు నెటిజన్లు మండిపడుతున్నారు. 

మంగళవారం రాత్రి క్రికెట్ ప్రేమికులకు  అసలు సిసలు క్రికెట్ మజా లభించింది. మొహాలీ, కరాచీ వేదికగా నాలుగు అగ్రశ్రేణి క్రికెట్ జట్లు క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజాను పంచాయి.  మొహాలీలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగగా.. కరాచీలో పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లలో ఆతిథ్య జట్లు చతికిలపడ్డాయి. బౌలింగ్ వైఫల్యంతో భారత్ దెబ్బతినగా.. బ్యాటింగ్ లోపంతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే భారత్ ఓటమిపై పాకిస్తాన్ నటి  సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలు మాత్రం ట్విటర్ లో నెటిజన్లను ఆగ్రహావేశాలకు గురి చేశాయి. టీమిండియా గురించి మట్లాడే ముందు పాకిస్తాన్ జట్టు గురించి చూసుకుంటే మంచిదని నెటిజన్లు ఆమెకు సూచిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిశాక టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ట్విటర్ లో ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మేం నేర్చుకుంటాం.. మేం మెరుగవుతాం. మాకు మద్ధతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ కు షిన్వారి స్పందిస్తూ.. ‘మీరు రాబోయే టీ20 ప్రపంచకప్ లో అక్టోబర్ 23న పాకిస్తాన్ మీద కూడా ఓడిపోండి. అప్పుడు మీరింకా బాగా నేర్చుకోవచ్చు..’ అని  కామెంట్ చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.  షిన్వారికి ట్విటర్ లో కౌంటర్లు ఇస్తూ ఆమెను ఆటాడుకున్నారు. 

 

టీ20 ప్రపంచకప్ మ్యాచ్ సంగతి తర్వాత చూసుకుందాంలే గానీ ముందైతే మీ దేశంలో ఇంగ్లాండ్ తో  మీ జట్టు ఆడుతున్న మ్యాచ్ లు చూడు.. తొలి టీ20లో పాకిస్తాన్ చిత్తుగా ఓడుతుంది.. అని చురకలంటిస్తున్నారు.  షిన్వారి ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘హలో మేడమ్.. మీ జట్టు ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఆసియా కప్ ఫైనల్ లో బాగా పాఠాలు నేర్చుకుంది. నువ్వు ఈ  పిచ్చి వాగుడు  ఆపు. ఆటలో గెలుపు, ఓటములు సహజం. ముందు నువ్వు  ఇతరులపై ద్వేషం తగ్గించుకోవడమెలాగో నేర్చుకో.. ఇండియాతో ఎప్పటికీ పోల్చుకోకు..’ అని ఘాటు కామెంట్స్ చేశాడు. 

 

 

మరో నెటిజన్.. ‘వావ్.. మీ దేశానికి ఇంగ్లాండ్ రాక రాక వచ్చి టీ20 సిరీస్ ఆడుతున్నా దానిని వదిలేసి నువ్వు ఇండియా మ్యాచ్ చూస్తున్నావ్.. అది టీమిండియా బ్రాండ్ అంటే.. ఇది తెలుసుకో నువ్వు ముందు..’అని రిప్లై ఇచ్చాడు.  
 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే