
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్స్ రిపీట్ చేస్తూ.. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత A జట్టు, పాకిస్తాన్ A జట్టు చేతుల్లో 128 పరుగుల తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది. టాస్ గెలిచి పాకిస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించింది భారత జట్టు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్తాన్ A జట్టు..
సయిం ఆయుబ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా సహీబ్‌జాదా ఫర్హాన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఓమర్ యూసఫ్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. 29 ఏళ్ల తయ్యాబ్ తాహీర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
కెప్టెన్ మహ్మద్ హారీస్ 2 పరుగులు చేసి అవుట్ కాగా ఖాసీం అక్రమ్ డకౌట్ అయ్యాడు. ముబసిర్ ఖాన్ 35 పరుగులు చేయగా మెహ్రీన్ ముంతాజ్ 13 పరుగులు చేశాడు. మహ్మద్ వసీం జూనియర్ 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్‌గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా హర్షిత్ రాణా, మనవ్ సుథార్, నిశాంత్ సింధులకు తలా ఓ వికెట్ తీశారు..
రాజవర్థన్ హంగర్‌గేకర్ బౌలింగ్‌లో సయిం ఆయుబ్ అవుటైనా ఆ బంతి నో బాల్‌గా తేలడంతో టీమిండియాకి వికెట్ దక్కలేదు.
353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే అర్షద్ ఇక్బాల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అయితే ఈ బంతి నో బాల్‌గా టీవీ రిప్లైలో తేలింది. అయితే పాక్ థర్డ్ అంపైర్ మాత్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు..
15 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన నికిన్ జోష్, మహ్మద్ వసీం బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే నికిన్ జోష్ బ్యాటుకి బాల్ తగలకపోయినా అంపైర్ అవుట్ ఇవ్వడం విశేషం. అభిషేక్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి పోరాడాడు..
కెప్టెన్ యష్ ధుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ కావడంతోనే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. నిశాంత్ సింధు 10, ధృవ్ జురెల్ 9, రియాన్ పరాగ్ 14, హర్షిత్ రాణా 13, రాజవర్థన్ హంగర్‌గేకర్ 11 పరుగులు చేసి వెంటవెంటనే పెవిలియన్ చేరారు.. యువరాజ్‌సిన్హా దోహియా 5 పరుగులు చేసి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది..
గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత యువ జట్టు, ఫైనల్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది.