కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ అజామ్..!

Published : Jun 09, 2022, 10:02 AM IST
 కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ అజామ్..!

సారాంశం

గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కూడా అయిన ఇంజిమాముల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు సాధించి ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. 

టీమిండియా మాజీ క్రికెటర్ కోహ్లీ కి ఊహించని షాక్ తగిలింది. కోహ్లీ రికార్డును పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్రేక్ చేశాడు. వన్డే కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అధిగమించాడు. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో బుధవారం, జూన్ 8న నికోలస్ పూరన్ వెస్టిండీస్‌తో జరిగిన మెన్ ఇన్ గ్రీన్ రీషెడ్యూల్ చేసిన మొదటి  ఓడీఐలో బాబర్ ఈ ఘనత సాధించాడు.

గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కూడా అయిన ఇంజిమాముల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు సాధించి ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. 

జనవరి 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన భారత ద్వైపాక్షిక వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో కోహ్లీ తన 17వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. బుధవారం మ్యాచ్‌కు ముందు, కోహ్లీని రికార్డు బ్రేక్ చేయడానికి బాబర్‌కు 98 పరుగులు అవసరం. అయితే తొలి వన్డేలోనే ఈ రైట్‌హ్యాండర్ కోహ్లీని దాటేశాడు.

పాకిస్తాన్  కెప్టెన్‌గా 27ఏళ్ల బాబర్.. 13 ఇన్నింగ్స్‌లలో 91.36 సగటుతో 1005 పరుగులు,ఆరు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో 103.71 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టాడు.

కరీబియన్లతో జరిగిన వన్డే సిరీస్ లో  బాబర్ 107 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఆతిథ్య జట్టు పై ఐదు వికెట్ల తేడాతో గెలిపించాడు.  23 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును  ఖుష్దిల్ షా గెలుచుకున్నాడు. అయితే... కోహ్లీ రికారర్డు బ్రేక్ చేసి బాబర్ కూడా ప్రశంసలు అందుకున్నాడు. 

బాబర్ ప్రస్తుతం ODIలు , T20I లలో నం.1 ర్యాంక్ బ్యాట్స్ మెన్ గా నిలవడం గమనార్హం.  87 ODIల్లో ఈ యువ క్రికెటర్  17 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలతో 59.78 సగటుతో , 90.42 స్ట్రైక్ రేట్‌తో 4364 పరుగులు చేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !