IPL: లక్నో జెర్సీ ఇదేనా..? లాంచింగ్ కు సూపర్ స్కెచ్.. బాద్షాతో భారీగానే ప్లానే వేసిందిగా..

Published : Mar 11, 2022, 01:44 PM ISTUpdated : Mar 11, 2022, 01:47 PM IST
IPL: లక్నో జెర్సీ ఇదేనా..? లాంచింగ్ కు సూపర్ స్కెచ్.. బాద్షాతో భారీగానే ప్లానే వేసిందిగా..

సారాంశం

IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ  ఆయా జట్లు.. ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాయి. మరికొద్దిరోజుల్లో ఫ్రాంచైజీలు తమ కొత్త జెర్సీలను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన రెండు  ఫ్రాంచైజీలు కూడా.. 

ఈ ఏడాది ఐపీఎల్  లో కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఇంకా తన అధికారిక జెర్సీని విడుదల చేయాల్సి ఉంది. నేడో రేపో ఎల్ఎస్జీ జెర్సీని విడుదల చేసేందుకు  ఆ ఫ్రాంచైజీ  ప్రణాళికలు వేసింది.  ఈ మేరకు ప్రస్తుతం ఇండియాలో టాప్ లో దూసుకుపోతున్న  ప్రముఖ  ర్యాపర్  బాద్షాతో ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా  చేసి.. తద్వారా  జెర్సీని లాంచ్ చేయాలని చూసింది. అయితే ఎల్ఎస్జీ జెర్సీకి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. 

ఐపీఎల్ లో ఎల్ఎస్జీకి  ఒక ప్రమోషనల్ సాంగ్ చేసేందుకు  బాద్షాను నియమించిన యాజమాన్యం.. అందుకోసం షూట్ కూడా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పలు విజువల్స్ నెట్ లో లీకయ్యాయి. ఈ  ఫోటోలలో బాద్షా.. ఎల్ఎస్జీ కొత్త జెర్సీ (లైట్ స్కై బ్లూ కలర్ షర్ట్, భుజాల దగ్గర ఆరెంజ్ కలర్ తో షేడ్) ని వేసుకుని ఉన్న విజువల్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 

 

ఈ  ప్రమోషనల్ సాంగ్ లో బాద్షా ఎల్ఎస్జీ జెర్సీని ధరించడమే గాక ఆ జట్టుకు చెందిన లోగోను చేతబట్టి స్టెప్పులేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదే పాటలో  బాద్షా వెనుకాల ఎల్ఎస్జీ  లోగోలు, జెండాలతో అభిమానులు సందడి చేస్తున్నారు. 

 

ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో...

ఇదిలాఉండగా లక్నోతో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కూడా  వాళ్ల కొత్త జెర్సీని ఆదివారం విడుదల చేయనుంది. మార్చి 13న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో  సాయంత్రం తమ జట్టు జెర్సీ ని విడుదల చేయనుంది.  ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. 

కాగా మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న  ఐపీఎల్ -2022 సీజన్ లో ఈ ఇరుజట్లు తలపడబోతున్నాయి.  మార్చి 28 ఈ రెండు జట్ల మధ్య.. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?