బీసీసీఐ కాసుల కక్కుర్తి! వన్డే వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో కనిపించని ఫ్యాన్స్... ఇలాగే సాగితే..

By Chinthakindhi Ramu  |  First Published Oct 5, 2023, 4:06 PM IST

ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌లో 10 శాతం కూడా కనిపించని ప్రేక్షకులు.. దాదాపు ఖాళీ స్టేడియంలో ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్... 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్న బీసీసీఐ, ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే విమర్శలు ఎదుర్కుంటోంది. వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల విషయంలో పెద్ద స్కామ్ జరిగింది, జరుగుతోంది కూడా. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో కూడా అన్ని మ్యాచుల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. కానీ భారత్‌లాంటి దేశంలో మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో పూర్తిగా విక్రయించలేమని, అలాగే ఈపాస్‌లను అనుమతించమని బాంబు పేల్చాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

అప్పుడిన్ని, ఇప్పుడిన్ని టికెట్లు ప్రేక్షకుల కోసం విక్రయానికి పెట్టారు. ఇలా చాలా టికెట్లు బీసీసీఐ పెద్దలకు, వారి కుటుంబాలకు, వారి స్నేహితుల కుటుంబాలకు, బంధువులకు వెళ్లినట్టు సమాచారం. ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా చూడడానికి అభిమానులు, స్టేడియానికి వెళ్తారు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో మాత్రం జనాలు కనిపించలేదు..

Latest Videos

ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం పూర్తి కెపాసిటీ 1 లక్షా 37 వేలు. అయితే ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌కి ఇందులో 10 శాతం కూడా హాజరు కాకపోవడం విశేషం. 

టీ20ల ఎంట్రీ తర్వాత వన్డే మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడడం లేదు. అదీకాకుండా వరల్డ్ కప్‌ మ్యాచుల టికెట్ ధరలు కూడా ప్రేక్షకులు స్టేడియానికి రాకపోవడానికి ఓ కారణం. 

Where’s the crowd !?🤔🤔

— Danielle Wyatt (@Danni_Wyatt)

ఇండియాలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వచ్చిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ మ్యాచ్ చూసేందుకు విదేశాల నుంచి పని గట్టుకుని ఇక్కడికి వచ్చేవారి సంఖ్య చాలా తక్కువ. అదీకాకుండా వీకెండ్ మధ్యలో వరల్డ్ కప్ ప్రారంభం కావడంతో జనాలు స్టేడియానికి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు..

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానెల్లీ వ్యాట్, ‘వరల్డ్ కప్ మ్యాచ్‌లో జనం ఎక్కడ?’ అంటూ ట్వీట్ చేసింది. ప్రపంచ కప్ ఆరంభ వేడుకలను కూడా రద్దు చేయడంతో చాలామందికి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలైన విషయం కూడా తెలయడం లేదు. అక్టోబర్ 8న జరిగే ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌తో వరల్డ్ కప్ ఫివర్ మొదలు కావచ్చు.. మ్యాచులు పెరిగే కొద్దీ, ప్రపంచ కప్‌కి క్రేజ్ పెరుగుతుంది. వచ్చే వారం దసరా సెలవులు కూడా ప్రారంభం కాబోతుండడంతో జనాలు, స్టేడియానికి క్యూ కట్టడం గ్యారెంటీ..

click me!