రొనాల్డో 700 గోల్స్‌పై యువీ ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు.. నువ్వు కూడా క్లబ్ పెట్టావా..? అని సెటైర్లు

Published : Oct 10, 2022, 05:25 PM IST
రొనాల్డో 700 గోల్స్‌పై యువీ ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు.. నువ్వు కూడా క్లబ్  పెట్టావా..? అని సెటైర్లు

సారాంశం

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిన్న తన లీగ్ ఫుట్‌బాల్ కెరీర్ లో 700 వ గోల్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యువీ చేసిన ఓ ట్వీట్  పై నెటిజన్లు అతడిని ఆటాడుకుంటున్నారు. 

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా మక్కువ ఎక్కువ. గతంలో అతడు తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ యూనైటైడ్  కు సంబంధించిన విజయాలపై ట్వీట్స్ కూడా చేశాడు. తాజాగా యువీ.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్  పై స్పందిస్తూ ట్విటర్ లో చేసిన ఓ ట్వీట్ మాత్రం మిస్ ఫైర్ అయింది.  అలవాటులో పొరపాటుగా యువీ.. ఫుట్‌బాల్ ఆటలో కూడా క్రికెట్  పరిభాషనే వాడి అడ్డంగా బుక్కయ్యాడు.  సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యువీని ఆటాడుకుంటున్నారు. 

అసలు విషయానికొస్తే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో భాగంగా మాంచెస్టర్ యూనైటైడ్ తరఫున ఆడుతున్న రొనాల్డో.. నిన్న  ఎవర్టన్ తో  జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా  లీగ్ ఫుట్‌బాల్ కెరీర్ లో 700 గోల్స్ కొట్టిన తొలి  ఆటగాడిగా  అరుదైన ఘనత సాధించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డోకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో యువీ కూడా ఓ ట్వీట్ చేస్తూ..  ‘కింగ్ ఈజ్ బ్యాక్. ఫామ్ తాత్కాలికం. క్లాస్ శాశ్వతం.. 700 క్లబ్ కు  స్వాగతం రొనాల్డో.. నెంబర్ 7 గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)..’ అని ట్వీట్ చేశాడు.  ఇదే యువీ కొంపముంచింది.  ఈ జాబితాలో రొనాల్డో తప్ప మరెవరూ లేరు. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో 700 గోల్స్ కొట్టిన తొలి ఫుట్బాలర్ రొనాల్డో మాత్రమే. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆటాడుకున్నారు. 

 

యువీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే పలువురు నెటిజన్లు  దానిపై స్పందిస్తూ.. ‘700 క్లబ్ లో ఉన్నది ఒకడే ఒక్కడు. అది కూడా రొనాల్డోనే. మళ్లీ క్లబ్ కు స్వాగతమేంటి..? ఇంతకుముందు నువ్వేదో అందులో ఉన్నట్టు..’, ‘ఏంటి నువ్వు ఆ క్లబ్ ఓపెన్ చేశావా..?’ ‘స్వాగతమా..? దేనికి..? భాయ్.. అవి రన్స్ కాదు.. గోల్స్’, ‘మీరు ఏ 700 క్లబ్ గురించి మాట్లాడుతున్నారు సార్..?’ అని  కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !