భారత్ లాక్ డౌన్, మూడేళ్ల క్రితమే చెప్పిన జోఫ్రా ఆర్చర్... పాత ట్వీట్ వైరల్

By telugu news teamFirst Published Mar 25, 2020, 10:14 AM IST
Highlights

ఇప్పటి నుంచి మీ పేరు జ్యోత్సి జయ శంకర్ ఆచార్య అని ఒకరు కామెంట్ పెట్టగా.. మరో నెటిజన్ తన పుట్టిన తేదీ, సమయం పెట్టి.. లైఫ్‌ టైమ్ ఎలా ఉంటుందో చెప్పండి అని కామెంట్ పెట్టారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో కరోనాని అరికట్టేందుకు భారత్ లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ పాత ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇంటి పట్టునే మూడు వారాలు సరిపోతాయా..? పారిపోవడానికి కూడా ఎక్కడా ప్లేస్ కూడా దొరకని రోజు వస్తుంది అంటూ 2017 అక్టోబర్ 23న అతడు వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ ని చూసిన నెటిజన్లు.. సర్ భవిష్యత్తు మీకు ముందే తెలిసిపోతుందా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అక్కడితో ఆగడం లేదు. మా జాతకం చెప్పండి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read నా నగరం ఇలా అయ్యింది.. ఎప్పుడూ అనుకోలేదు: గంగూలీ ఆవేదన...

ఇప్పటి నుంచి మీ పేరు జ్యోత్సి జయ శంకర్ ఆచార్య అని ఒకరు కామెంట్ పెట్టగా.. మరో నెటిజన్ తన పుట్టిన తేదీ, సమయం పెట్టి.. లైఫ్‌ టైమ్ ఎలా ఉంటుందో చెప్పండి అని కామెంట్ పెట్టారు. మరో సీఏ స్టూడెంట్.. ఐసీఏఐ మే 2020న జరగనున్న పరీక్షలు వాయిదా పడతాయా..? అని ప్రశ్నించారు. మరో నెటిజన్‌ సార్ అప్పుడైనా తగ్గిపోతుందా..? అని అడిగారు. ఇంకో నెటిజన్‌ డ్యూడ్ మీరు తప్పు వృత్తిలో ఉన్నారు అంటూ కామెంట్ పెట్టారు.

అయితే భవిష్యత్‌ను ముందే ఊహించి.. గతంలోనూ ఆర్చర్ చేసిన పలు ట్వీట్లు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పృథ్వీ షాపై వేటు.. ఆర్టికల్ 370 రద్దు గురించి ఆర్చర్ ట్వీట్ వేయగా.. అవి వైరల్ అయిన విషయం తెలిసిందే.

click me!