ఆ నిర్ణయం సరైంది కాదు... మరోసారి ఆలోచించాలి: షోయబ్ అక్తర్

By Arun Kumar PFirst Published Aug 5, 2019, 6:22 PM IST
Highlights

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో మార్పులు చేపడుతూ ఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని పాాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. ఈ నిర్ణయం టెస్ట్ క్రికెట్ ను బ్రతికించడం అటుంచితే హాని తలపెట్టే అవకాశాలున్నాయని అన్నాడు.   

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సీరిస్ ద్వారా టెస్టుల్లోకి ఓ కొత్త సాంప్రదాయం ప్రవేశించింది. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెట్  మ్యాచుల్లో మాత్రమే ఆటగాళ్ల  జెర్సీలపై పేర్లు, నంబర్లు వుండేవి. టెస్టుల్లో కేవలం తెల్లని దుస్తులతో మాత్రమే ఆటగాళ్లు బరిలోకి దిగేవారు. కానీ ఈ యాషెస్ సీరిస్ లో మాత్రం ఇంగ్లాండ్, ఆసిస్ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, వారికి ఇష్టమైన నంబర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా సాంప్రదాయ టెస్ట్ జెర్సీలో మారుస్తూ కొత్త సాంప్రదాయానికి  తెరలేపిన ఐసిసి(ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్) నిర్ణయంపై మాజీ ఆటగాళ్లు భగ్గుమంటున్నారు. 

ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీలు బ్రెట్ లీ, గిల్ క్రిస్ట్ లు ఇలా టెస్ట్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు చేర్చడాన్ని తప్పుబట్టారు. తాజాగా పాకిస్థాన్ మాజీ  బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ అక్తర్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారి జాబితాలో చేరిపోయాడు. 

''టీ20ల రాకతో రోజురోజుకు పూర్తిగా ఆదరణ కోల్పోయిన టెస్ట్ క్రికెట్ ను బ్రతికించడానికే జెర్సీలో మార్పులు చేపట్టామని ఐసిసి అంటోంది. కానీ టెస్ట్ జెర్సీపై ఆటగాళ్ళ పేరు చేర్చడం సాంప్రదాయబద్దమైన టెస్టు  మ్యాచుల్లో ఎబ్బేట్టుగా అనిపిస్తోంది. ఇలా టెస్టులను మరింత ఆకర్షణీయంగా మార్చడానికంటూ తీసుకున్న నిర్ణయం కాస్తా ఈ ఫార్మాట్ ను అభిమానులకు మరింత దూరం చేసేలా వుంది. కాబట్టి ఈ విషయంపై ఐసిసి పునరాలోచన చేయాల్సి అవసరం వుంది.'' అని అక్తర్ సూచించాడు. 

అక్తర్ కంటే ముందే ఆసిస్ క్రికెట్ దిగ్గజాలు ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  టెస్ట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు పేర్లతో కూడిన జెర్సీలు ధరించడం చెత్త నిర్ణయమని మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. అలాగే బ్రెట్ లీ కూడా టెస్టు జెర్సీలో మార్పులు చేపడుతూ ఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కామెంట్స్ చేశాడు. ఇలా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ విషయంలో ఐసిసి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 
 

click me!