IPL 2024: మరింత క్రమశిక్షణ, ధైర్యం అవసరం: పరాజయంపై హార్దిక్ పాండ్యా

By Rajesh Karampoori  |  First Published Apr 2, 2024, 4:24 AM IST

IPL 2024:ఐపీఎల్‌-2024లో హార్దిక్ పాండ్యా  కెప్టెన్సీలోని ముంబై వరుసగా మూడు సార్లు ఓటమి పాలైంది. సోమవారం నాడు ముంబై హోం గ్రౌండ్ వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాభం ఎదురైంది. 


IPL 2024: ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో సారి కూడా ఓటమి పాలైంది. వాంఖడే వేదికగా రాజస్థాన్  రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది.తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ రాజస్తాన్‌ బౌలర్ల దాటికి గజగజలాడింది. కాగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, స్పిన్నర్‌ చాహల్‌ రెచ్చిపోయారు. వారు చెరో మూడు వికెట్లు తీసి.. ముంబై నడి విరిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా(34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేసి పర్వాలేదని పిలిచారు.  

ఆ తరువాత 126 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు వచ్చిన రాజస్తాన్ బ్యాట్స్ మెన్స్ ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్ మెన్స్ లో రియాన్‌ పరాగ్‌ తన పరాక్రమాన్ని ప్రదర్శించారు. కేవలం 39 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.  ఇలా ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై  ఇండియన్స్ వరుసగా మూడుసార్లు అపరాజయం పాలు కావడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. అలాగే అభిమానుల్లో ఆయన పై తీవ్ర సంత్రుప్తి చెలారేగుతోంది. 

Latest Videos

ఈ తరుణంలో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ..  బ్యాటింగ్‌లో తాను ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.  ప్రణాళికలకు తగ్గట్లు తాము బ్యాటింగ్ చేయలేకపోయామనీ, శుభారంభాన్ని అందుకోలేకపోతున్నామని, ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేస్తుందని అన్నారు. ఈ పరిస్థితిని తిప్పికొట్టడానికి కొంత క్రమశిక్షణ, ధైర్యాన్ని ప్రదర్శించాలని అతని జట్టును కోరారు.

తాము కోరుకున్న విధంగా ప్రారంభాన్ని అందుకోలేకపోతున్నామనీ, ఈ రాత్రి కఠినమైన రాత్రి అని హార్దిక్ అన్నారు.అయితే ఓ దశలో తాము 150 లేదా 160కి చేరుకుంటామని, ప్రారంభంలో మంచి స్థితిలో ఉన్నామని తాను భావించాననీ, కానీ నా వికెట్ పడటంతో ఆట తీరు పూర్తిగా మారిపోయిందని అన్నారు. రాజస్థాన్ రాయల్స్ క్రమంగా పట్టు బిగించిందనీ, తాను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉండేదని అన్నారు.  తాము మరింత క్రమశిక్షణతో, మరింత ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.
 

click me!