వరల్డ్ కప్ ఎఫెక్ట్... విండీస్ పర్యటనకు ధోనీ దూరం..?

By telugu teamFirst Published Jul 17, 2019, 11:24 AM IST
Highlights

మొన్నటి వరకు ధోనీ.. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్లు ధోనీని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ధోనీ రిటైర్మెంట్ పై నోరు విప్పకపోయినా... ఈ విషయంపై ఊహాగానాలు మాత్రం వీడటం లేదు.
 

వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీం ఇండియా వెళ్లనుంది. వెస్టిండీస్ లో తలపడే జట్టును ఈ నెల 19వ తేదీన బీసీసీఐ ఎంపిక చేయనుంది. అయితే... ఈ జట్టులో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ... ఈ  పర్యటనకు ధోనీని దూరం గా ఉంచాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు ధోనీ వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్లు ధోనీని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ధోనీ రిటైర్మెంట్ పై నోరు విప్పకపోయినా... ఈ విషయంపై ఊహాగానాలు మాత్రం వీడటం లేదు.

ధోనీ వయసు 38కి చేరడంతో అతనిలో సత్తా తగ్గిపోయిందని... యువ ఆటగాళ్లలా ఆడలేకపోతున్నాడనే అభిప్రాయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ సమరంలోనూ ధోనీ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.  ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ కారణంగానే టీం ఇండియా ఓటమిపాలయ్యిందని విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ధోనీని విండీస్ పర్యటనకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

. ‘ఈ నెల 19వ తేదీన ముంబయిలో సెలక్టర్లు సమావేశమౌతున్నారు. ధోనీ నుంచి మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆటగాళ్లు, సెలక్టర్లు మాట్లాడుకోవడం ముఖ్యం. నన్నడిగితే.. వరల్డ్ కప్ లో ధోనీ మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. తన భవిష్యత్తుపై ధోనీనే నిర్ణయం తీసుకోవాలి’ అంటూ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.  మరి ఈ విషయంపై ధోనీ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

click me!