ధోనిపై అభిమానమే అక్కడ కడుపు నింపుతుంది

Published : Jun 13, 2019, 07:42 PM IST
ధోనిపై అభిమానమే అక్కడ కడుపు నింపుతుంది

సారాంశం

మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాడు.  బ్యాట్ మెన్, సారథి, వికెట్ కీపర్ రాణిస్తూ అభిమానుల మనసులు కొల్లగొట్టాడు. అయితే అతడిపై అభిమానమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొందరు నిరుపేదలకు మూడు పూటల ఉచితంగా కూడా దొరికేలా చేస్తోంది. అలా ధోని అభిమానుల ఆకలి బాధను తీరుస్తున్నది కూడా ఓ అభిమానే కావడం విశేషం.   

పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్‌ద్వార్ పట్టణానికి చెందిన శంభు బోస్(32) ధోనికి వీరాభిమాని. అయితే అతడు కేవలం తాను ధోని అభిమానినని చెప్పుకుని తిరక్కుండా ఓ మంచి పనికి పూనుకున్నాడు. ధోని పేరుతో తన పట్టణంలోనే ఓ చిన్న హోటల్ ను ప్రారంభించాడు. ఆ హోటల్లో ధోని అభిమానులైన నిరుపేదలకు ఉచిత బోజనాన్ని అందించడం ప్రారంభించాడు. ఇలా తన అభిమానాన్ని చాటుకోవడమే కాదు...తోటి అభిమానుల ఆకలి బాధను కూడా తీరుస్తున్నాడు. ఇలా బోస్ ఓ వైపు అభిమానిగా...మరో వైపు సామాజిక సేవకుడిగా ఆ పట్టణంలో గుర్తింపు పొందాడు. 

అయితే ధోని హోటల్ గురించి తెలుసుకున్న కొందరు మీడియాకు సమాచారం అందించారు. దీంతో తన అభిమాన ఆటగాడి కోసం అతడు చేస్తున్న సామాజిక సేవ బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే బోస్ మాత్రం ఈ సేవను ఇక్కడికే పరిమితం చేయనని...ఇంకా ఇలాంటి హోటళ్లు మరికొన్ని ప్రారంభించి ధోని తనలాంటి  ధోని అభిమానులకు మరింత సేవ చేయాలని భావిస్తున్నట్లు భోస్ తెలిపాడు.  

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ