హైదరాబాద్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాను ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో మిథాలీ రాజ్ ను రెండో స్థానానికి నెట్టేసింది. పూనమ్ యాదవ్ కు మాత్రం టాప్ గ్రేడ్ లో స్థానం సంపాదించుకుంది.
ముంబై: హైదరాబాదీ స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిగ్ షాక్ ఇచ్చింది. మహిళా జట్టు సభ్యుల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాలో బీసీసీఐ హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ గ్రేడ్ ను దిగజార్చింది. ఆమెకు ఏ గ్రేడ్ కాకుండా బీ గ్రేడ్ ఇచ్చింది.
భారత టీ20 మహిళల ఆంతర్జాతీయ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, సిన్నర్ పూనమ్ యాదవ్ లకు ఏ గ్రేడ్ ఇచ్చింది. ముగ్గురు క్రిడాకారిణులకు రూ. 50 లక్షల రూపాయల చొప్పున ముడుతాయి. ఈ కాంట్రాక్టులను అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ప్రకటించింది.
undefined
పురుషుల క్రికెటర్లకు మాదిరిగా కాకుండా మహిళ క్రికెటర్లకు మూడు గ్రేడ్ లు మాత్రమే ఇచ్చింది. పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన తర్వాత గురువారం మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది.
మహిళా క్రికెటర్లకు ఎ, బి, సీ అనే మూడు గ్రేడ్ లు ఇచ్చారు. పురుషుల క్రికెటర్లకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ లను ఇచ్చింది. టాప్ కెటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రాలను చేర్చినట్లుగానే మహిళా క్రికెటర్లలో కూడా ముగ్గురిని చేర్చింది.
మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాధా యాదవ్, శిఖా పాండే, దీప్తీ శర్మ, జెమిమాహ్ రోడ్రిగ్స్, తాననియా భాటియాలకు బీ గ్రేడ్ ఇచ్చారు. ఈ గ్రేడ్ క్రీడాకారిణులు రూ. 30 లక్షల చొప్పున పొందుతారు.
Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు
సీ గ్రేడ్ లో వేద కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, ్నుజ పాటిల్, మాన్సీ జోషి, డి హేమలత, అరుంధతీ రెడ్డి, రాజేశ్వరి గయక్వాడ్, పూజా వస్త్రాకర్, హర్లీన్ డయోల్, ప్రియా పూనియా, షఫాలీ వర్మలను చేర్చారు. వీరికి రూ. 10 లక్షల చొప్పున చెల్లిస్తారు.
Also Read: ధోనీకి కాంట్రాక్టు జాబితాలో చోటేందుకు దక్కలేదో చెప్పిన బీసీసీఐ.
అంతకు ముందు పురుషుల వార్షిక కాంట్రాక్టు జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లేడు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు.