మిథాలీరాజ్ ఖాతాలో మరో అద్భుత రికార్డు... తొలి మహిళా క్రికెటర్‌గా...

Published : Mar 14, 2021, 03:35 PM IST
మిథాలీరాజ్ ఖాతాలో మరో అద్భుత రికార్డు... తొలి మహిళా క్రికెటర్‌గా...

సారాంశం

వన్డే క్రికెట్‌లో 7 వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు... వన్డేల్లో 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక మహిళ క్రికెటర్‌గా మిథాలీరాజ్...  

భారత వన్డే టీమ్ కెప్టెన్, ‘లేడీ సచిన్’ మిథాలీరాజ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. మహిళల వన్డే క్రికెట్‌లో 7 వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది మిథాలీరాజ్.

గత మ్యాచ్‌లో ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచిన మిథాలీరాజ్, దక్షిణాఫ్రికాతో జరగుతున్న నాలుగో వన్డేలో 71 బంతులాడి 4 ఫోర్లతో 45 పరుగులు చేసింది. 

26 పరుగుల వద్ద వన్డేల్లో 7 వేల మైలురాయి అందుకున్న మిథాలీరాజ్, మహిళల క్రికెట్‌లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ 5992 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిందా క్లార్క్ 4844 పరుగులతో మూడో స్థానంలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !