న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంత్నర్ ఒంటి చేతితో కళ్లు చెదిరే క్యాచ్ ను పట్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెవిలియన్ కు పంపించాడు. బెన్నెట్ వేసిన బంతిని సిక్స్ మలచడానికి ప్రయత్నించి కోహ్లీ అవుటయ్యాడు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మీద జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. మరోసారి తన బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. అత్యంత ప్రమాదకరమైన విరాట్ కోహ్లీని మిచెల్ సాంత్నర్ అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కు చేర్చాడు.
ఒంటి చేతితో క్యాచ్ పట్టి సాంత్నర్ అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. రెండు వరుస బౌండరీలు కొట్టిన విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే, అతని ఇన్నింగ్సు ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. సాంత్నర్ కళ్లు చెదిరే క్యాచ్ ద్వారా అతన్ని అవుట్ చేశాడు.
undefined
తొలి ఇన్నింగ్సు ఐదో ఓవరులో అది జరిగింది. టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్ ఆహ్వానించిన న్యూజిలాండ్ బౌలింగులో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. కేఎల్ రాహుల్ తో పాటు సంజూ శాంసన్ ఇన్నింగ్సును ప్రారంభించారు. శాంసన్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్సును నిర్మించాలని అనుకున్నాడు.
అంతా సజావుగా సాగుతుందని భావించిన తరుణంలో హమీష్ బెన్నెట్ వేసిన బౌలింగులో విరాట్ కోహ్లీ సాంత్నర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెన్నెట్ ఆఫ్ స్టంప్ ఆవలికి లెంగ్ డెలివరీ వేశాడు. దాన్ని సిక్స్ గా మలచాలనే ప్రయత్నంలో కోహ్లీ ఫ్లిక్ షాట్ కు వెళ్లాడు. అయితే బంతి ఎక్కువ ఎత్తులో వెళ్లకుండా గాలిలో లేచింది. ఆ బంతిని సాంత్నర్ డైవ్ చేసి సాంత్నర్ ఒంటి చేత్తో అందుకున్నాడు.
Flying Santner
Nice way to dismiss a world class batsman. pic.twitter.com/HRK9mpHMA6