ICC World cup 2023: వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి మిచెల్ మార్ష్! ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి దూరం...

By Chinthakindhi Ramu  |  First Published Nov 2, 2023, 5:10 PM IST

Australia vs England: వరుసగా నాలుగు విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చిన ఆస్ట్రేలియా... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్.. 


మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదుంది ఆస్ట్రేలియా. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా ఆసీస్, సెమీస్ చేరేందుకు అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి..

వరుస విజయాలతో ఊపుమీదున్న ఆసీస్‌కి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. ఇప్పటికే మార్కస్ స్టోయినిస్ గాయంతో బాధపడుతుంటే, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు..

Latest Videos

undefined

నవంబర్ 4న అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌కి గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ కూడా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడడం లేదు..

కామెరూన్ గ్రీన్ గాయంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యాడు. మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాలతో వన్డే వరల్డ్ కప్‌కి దూరం కావడంతో కామెరూన్ గ్రీన్‌ని తిరిగి పిలిచే అవకాశం ఉంది.  

‘మిచెల్ మార్ష్ కుటుంబ సమస్యలతో స్వదేశానికి వెళ్తున్నాడు. కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదు. అతను చేస్తున్నది సరైన పనే. ఇప్పుడు తన కుటుంబానికి మార్ష్ అవసరం ఉంది. అతను ఎప్పుడు వస్తాడో తెలీదు కానీ నేను కచ్చితగా వరల్డ్ కప్ గెలవడానికి తిరిగి వస్తానని నాతో చెప్పాడు. ఆ మైండ్‌ సెట్ చాలా ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు మార్కస్ స్టోయినిస్..

గాయంతో బాధపడుతున్న మార్కస్ స్టోయినిస్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మొదటి 6 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న ఇంగ్లాండ్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న డిఫెండింగ్ ఛాంపియన్‌ మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది..
 

click me!