MI vs RCB Suryakumar Yadav : టీ20 సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ అదిరిపోయింది. ఐపీఎల్ 2024 లో తొలి మ్యాచ్ లో సున్నాకే ఔటైన సూర్య.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ప్రచండమైన ఫామ్‌లో కనిపిస్తూ రికార్డు హాఫ్ సెంచరీ కొట్టాడు.
MI vs RCB Suryakumar Yadav : టీ20 క్రికెట్ లో తిరుగులేని ప్లేయర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లపై విధ్వంసం కురిపిస్తున్న ఈ స్టార్ ప్లేయర్ మరోసారి ఆర్సీబీ బౌలర్లపై అదిరిపోయే ఇన్నింగ్స్ లో చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సూపర్ ఇన్నింగ్ ఆడాడు. క్రికెట్ లవర్స్ ను బౌండరీల వర్షంలో ముంచెత్తాడు. గత మూడు నెలలుగా గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్న సూర్య ఇలాంటి ఇన్నింగ్స్ తో రీఎంట్రీలో అదరగొట్టడం విశేషం. ఐపీఎల్ 2024లో తన మొదటి మ్యాచ్‌లో గాయం నుండి తిరిగి వచ్చిన తర్వాత సూర్య డకౌట్ అయ్యాడు. కానీ ఆ తర్వాతి మ్యాచ్‌లోనే వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్ అసలు మ్యాజిక్ కనిపించింది. ఫోర్లు, సిక్సర్లు బాది ముంబైకి రెండో విజయాన్ని అందించాడు.
17 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ సింగిల్ డిజిల్ కే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్, ఫాఫ్ డు ప్లెసిస్, దినేశ్ కార్తీక్‌ల ధనాధన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ముంబైకి ఇషాన్ కిషన్ మొదట ఆర్సీబీపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో తన రెండో మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024 లో ఇది ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది.
MI vs RCB Highlights : దండయాత్ర.. ఆర్సీబీకి చుక్కలు చూపిస్తూ ఇరగదీశారు
అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ సత్తా చాటాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా తన అర్ధ సెంచరీని సాధించడానికి 19 బంతులు తీసుకున్నాడు.
ముంబైకి వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2024 లో ఆరంభంలో వరుస ఓటములతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు ఆర్సీబీపై గెలిచి రెండో విజయాన్ని అందుకుంది. వరుసగా 4 మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఆ తర్వాత తన 5, 6వ మ్యాచ్ లో విజయం సాధించింది. రాబోయే మ్యాచ్ లలో కూడా ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించింది ముంబై. బుమ్రా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇక బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (38), ఇషాన్ కిషన్ (69), సూర్యకుమార్ యాదవ్ (52)ల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీపై ముంబై విజయం సాధించింది.
ఆర్సీబీని దెబ్బకొట్టి చరిత్ర సృష్టించిన బుమ్రా..